రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే టీడీపీ గ్రాఫ్ పెరిగిందనే చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత మారిన పరిణామాలు పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాలను గమనిస్తే పార్టీ లో ఐక్యత స్పష్టంగా కనిపిస్తోంది. నాయకులకు పార్టీని నిలబెట్టు కోవాలనే అంశం స్పష్టంగా గోచరిస్తోంది.
దీంతో నాయకులు అందరు ఒక తాటి పైకి వఛ్చి పార్టీ కోసం పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బాబు అరెస్ట్ అనంతరం బంద్ కు పిలుపునివ్వగా తమ్ముళ్లు అందరు కలసి కట్టుగా జయప్రదం చేసేందుకు ముందుకు వచ్చారు. అదే సమయంలో నాయకుల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు కూడా సమసి పెయాయనే చెప్పాలి. ప్రస్తుతం తమ్ముళ్లలో పట్టుదల, పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలనే కసి పెరిగాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక, ప్రజల విషయానికి వస్తే సమాజంలోని దాదాపు అన్ని వర్గాలు కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన పరిస్థితిని చూసాం. ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు, మధ్య తరగతి ప్రజలు కూడా అరెస్ట్ ను తప్పు పట్టారు. అదే సమయంలో పార్టీ పైన సింపతీ పెరిగింది అనేది విశ్లేషకుల మాట. మొత్తంగా చూస్తే… టీడీపీ విషయంలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజల్లో ఆ పార్టీపై అనూహ్యంగా మద్దతు పెరగడంతో పాటు.. బాబు పైన సింపతీ పెరిగిందనడంలో సందేహం లేదు. బాబు అరెస్టు తర్వాత టీడీపీ గ్రాఫ్ 2 % పెరిగినట్టు విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఖఛ్చితంగా టీడీపీ భారీ మెజారిటీ తో గెలుస్తుందని అంటున్నారు పరిశీలకులు. దీనికి కారణం.. ఎప్పుడో జరిగిన కేసులో.. బాబును అన్యాయంగా అరెస్ట్ చేశారనే చర్చ గ్రామా స్థాయిలో ఎక్కువగా జరుగుతుండడమే. అంతేకాదు.. రాజకీయాల్లో ఉన్నవాళ్లు తప్పులు చేయని వారు ఎవరు అనే ప్రశ్న కూడా తెరమీదకి వస్తోంది. మొత్తంగా చూస్తే.. టీడీపీ గ్రాఫ్ పెరిగిందనే చెప్పాలి.