నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకులు.. ప్రజల అభ్యున్నతినే కోరుకుంటారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా వారి కోసం పనిచేస్తారు. ఇలాంటివారిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం ముందుంది.ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ ఎస్ అభ్యర్థికందాళ ఉపేందర్ రెడ్డి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇక్కడి ప్రజల కోరికను సాక్షాత్తూ సీఎం కేసీఆర్ ముందే ధైర్యంగా వెల్లడించారు. అదే దళిత బంధు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన అనేక పథకాల్లో దళిత బంధు అత్యంత కీలకమైన పథకం. దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం అమలు కావడం లేదంటే అతిశయోక్తి లేదు. దళితుల్లో పేదలుగా ఉన్న కుటుంబాలకు ఒకే ఏకంగా రూ.10 లక్షలను అందించి, వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునే లా చేస్తున్నారు. ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గం సహా గజ్వేల్ నియోజకవర్గంలోనూ ఈ పథకాన్నిఅమలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ పథకాన్ని బీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రధాన ఎన్నికల ప్రచారంగా మలుచుకుంది. అయితే.. ఈ పథకాన్ని తన నియోజకవర్గంలోనూ అమలు చేయాలని.. స్థానికంగా ఉన్న దళితులకు అండగా ఉండాలని పాలేరు నియోజకవర్గం అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డిసీఎంను కోరారు. దీనికి కేసీఆర్ సైతం పచ్చజెండా ఊపారు. ఇటీవల పాలేరు ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సీఎం కేసీఆర్.. జిల్లేళ్లగూ డెంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపేందర్‌రెడ్డి లోకల్‌గా ఉన్న దళితుల సమస్యలను ఆయనకు వివరించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని తన నియోజకవర్గంనూ పూర్తిగా.. ప్రతిఒక్క దళిత కుటుంబానికి అమలు చేయాలని సీఎంను కోరారు. దీనికి కేసీఆర్ సైతం ఓకే చెప్పడం గమనార్హం. చాలా మందిఎమ్మెల్యేలు చేయని సాహసం ఉపేందర్‌రెడ్డి చేశారనే మాట బీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఉపేందర్ రెడ్డి చేసిన ఈ డేరింగ్ స్టెప్‌తో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దళితుల ప్రేమలో ఆయన తడిసి ముద్దవుతోన్న వాతావరణమే ఉంది.