టీడీపీకి ఫుల్ సైలెంట్ ఓటింగ్.. బాబు విలువ ఇప్పుడు తెలిసిందా…!

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పేరు కైనా లేదు. ఆంధ్ర‌ప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం గా మారింది. ప్రపంచ నగరంగా అమరావతిని నిర్మించాలని చంద్రబాబు నాయుడు సంకల్పించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అంటూ అమరావతిని పక్కన పెట్టారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ రివర్స్ టెండరింగ్ అంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని రివర్స్లోకి తీసుకువెళ్లారని చెప్పవచ్చు.

ప్రజలకు డబ్బు పంచడమే పనిగా పెట్టుకున్న వైసిపి అభివృద్ధి గురించి పట్టించుకోవడమే మానేసింది. ఉద్యోగ క్యాలెండర్ లేదు.కొత్తగా స్థాపించిన పరిశ్రమలు లేవు. ఇవన్నీ ఎవరో చెప్తే తెలిసేది కాదు ప్రతి సామాన్యుడు ఇదే చెబుతున్నారు. పెరిగిన ధరలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులంతా చంద్ర బాబు నాయుడు వైపు చూస్తున్నారు. వైసిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చారు. రాష్ట్రంలో ఆర్ధిక వృద్ధి అన్నదే లేదు అని అందరూ వాపోతున్నారు.

వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరి చూపు చంద్రబాబు వైపే. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తు ఉండదని అందరూ భావిస్తున్నారు.ఇప్పటికే రోజురోజుకు ఆంధ్ర ప్రజలకు చంద్రబాబుపై ఆదరణ పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. అక్రమ అరెస్టుతో బాబుకు సానుభూతి విపరీతంగా పెరిగిందని చెప్పవచ్చు.కానీ అది బయట పెట్టడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు.

అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏ విషయం మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెట్టి లేదా సొంత పార్టీ నేతలతో దాడులు చేయించి హింసిస్తున్నారు. అందుకే ప్రజలందరూ మౌనంగా ఈ అరాచకాలను చూస్తూ ఉన్నారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నికలలో వైసీపీకి బుద్ధి చెప్పి టిడిపికి ఓట్లు వేసి గెలిపించుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే టిడిపి గెలవాలి చంద్రబాబు రావాలి అని ఆంధ్ర ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు…