విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ఏకైక సీరియల్ ఏదో తెలుసా… అంత స్పెష‌లా…!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి క్యారెట్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా విజయాన్ని సాధించడంతోపాటు విజయ్ కి నేషనల్ అవార్డుని కూడా తెచ్చి పెట్టింది. అయితే అప్పటికే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు విజయ్. పెళ్లి చూపులు సినిమా తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా మారిపోయాడు.

Pelli Choopulu movie review: Ritu Varma & Vijay Devarakonda's film is a refreshing romcom | India.com

ఆ తరువాత వచ్చిన సినిమాలు ఏది అంతగా సక్సెస్ కాకపోయినా వరుస చాన్సులతో దూసుకుపోతున్నాడు. విజయ్ ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇది పక్కన పెడితే విజయ్ సినిమాల్లోనే కాక సీరియల్ లో కూడా నటించాడట. ఇంతకీ ఏ సీరియల్ లో నటించాడు..? ఎప్పుడూ..? అనే విషయాన్ని తెలుసుకుందాం.

Vijay Deverakonda & Rashmika Mandanna Make Their Relationship Official (Indirectly) As The Actor Shares Picture Of Him At The Same Location As Actress From Maldives?

విజయ్ దేవరకొండ తన సెకండరీ ఎడ్యుకేషన్ పుట్టపర్తి లోని శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్లో కంప్లీట్ చేశాడు. అదే టైంలో సత్యసాయిబాబా జీవిత చరిత్ర ఒకటి తెలుగు సీరియల్ గా కొంతమంది నిర్మించారట. ఆ సీరియల్ షూటింగ్ టైంలో విజయ్ దేవరకొండ కూడా ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించాడట. ఆ విషయాన్ని స్వయంగా విజయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.

SS Rajamouli raves about Arjun Reddy, heaps praise on Vijay Devarakonda - Hindustan Times

కాగా ఈరోజు విజయ్ దేవరకొండ పుట్టినరోజు కారణంగా ఈ వార్త మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంత హీరోయిన్‌గా నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. లైగ‌ర్ లాంటి డిజాస్టర్ తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నాడు విజయ్.