రేవంత్ మాస్ట‌ర్ ప్లాన్‌.. తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో ప్రియాంక‌… పోటీ ఎక్క‌డ నుంచి అంటే…?

తెలంగాణ‌లో ఈ యేడాది చివ‌ర్లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌లు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ తెలంగాణ‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న తొలి స‌భ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఆమె ప్ర‌సంగానికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఆమె మాట్లాడుతున్న‌ప్పుడు కూడా ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న కాంగ్రెస్ వ‌ర్గాల‌ను బాగా ఖుషీ చేసింది.

How Indira Gandhi's arrest revamped Congress - India Today

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రియాంక‌ను తెలంగాణ నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తే అదిరిపోయే రెస్పాన్స్ ఉంటుంద‌ని.. అది ఖ‌చ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌ల్లో మాంచి జోష్ ఇచ్చిన‌ట్ల‌వుతుంద‌న్న అంచ‌నాలు కాంగ్రెస్ నాయ‌కులు వేస్తున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. గ‌తంలో ప్రియాంక నాన‌మ్మ‌, మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేసి సంచ‌ల‌న విజ‌యం సాధించారు.

అప్పుడు ఆమె మెద‌క్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. 1980లో ఇది జ‌రిగింది. అదే టైంలో ఇందిర క‌ర్నాక‌ట‌లోని చిక్‌బ‌ళ్లాపూర్ నుంచి కూడా పోటీ చేశారు. దీంతో మెద‌క్‌కు రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు టీ కాంగ్రెస్ మ‌ల్లాగుల్లాలు ప‌డుతోంది. ప్రియాంక‌ను 2024 లో జ‌రిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏదో ఒక సీటు నుంచి ఎంపీగా పోటీ చేయిస్తార‌ని తెలుస్తోంది.

I'm Indira's granddaughter, nothing can stop me from telling truth' » Yes Punjab - Latest News from Punjab, India & World

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని రెండు ఎంపీ సీట్లు లేదా ఖ‌మ్మం, మ‌ల్కాజ్‌గిరి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ సీట్ల‌లో ఎక్క‌డో ఓ చోట నుంచి ప్రియాంక గాంధీని పోటీ చేయిస్తే ఆ ప్ర‌భావం తెలంగాణ అంత‌టా ఉంటుంద‌ని.. ఈ సారి టీఆర్ఎస్‌పై ఉన్న వ్య‌తిరేక‌త చ‌క్క‌గా క్యాష్ చేసుకోవ‌చ్చ‌ని టీ కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నారు. వీళ్ల ఆలోచ‌న ఎలా ? ఉన్నా మ‌రి ప్రియాంక తెలంగాణ బ‌రిలో దిగ‌డానికి ఏం ఆలోచ‌న చేస్తుందో ? చూడాలి.