పచ్చి కొబ్బరిలో పోషకాలు తెలిస్తే… వ‌దిలిపెట్ట‌కుండా లాగిస్తారు…!

చాలామంది కొబ్బరి నీళ్లను తాగడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ పచ్చి కొబ్బరిని మాత్రం పెద్దగా పట్టించుకోరు. నిజానికి కొబ్బరి నీళ్లలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్ని ప‌చ్చి కొబ్బరి లో కూడా ఉంటాయి. ఎందుకంటే పచ్చి కొబ్బరిలో కాపర్, సెలీనియం, పొడెంషియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్, విటమిన్ సి, థయామిన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఇంకా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిగిన పచ్చి కొబ్బరి తో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు ఉన్నందున గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. ఫైబర్ కాంటెట్ ని కలిగిన పచ్చి కొబ్బరి సమస్యలను కూడా మెరుగుపరుస్తుంది.

పచ్చి కొబ్బరినూనె యాంటీ ఆక్సైడ్స్ లాంటి గుణాలు రోగనిరోధ‌క శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే ఐరన్ ఉండడం వల్ల రక్తహీనతను అరికట్టడంలో కూడా సహాయపడుతుంది. అలాగే హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తుంది. ఇందులోని విటమిన్ బి ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది. అలాగే ఒత్తిడి ,ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది.