మొఖంపై మొటిమలు, మచ్చ‌లా… ఇలా చేస్తే అన్నీ మ‌టుమాయం…!

మొఖంపై మొటిమలు, నల్ల మచ్చలు పోవడానికి రకరకాల క్రీములు, ఫేస్ వాష్ లు ఉపయోగిస్తూ ఉంటారు. క్రీమ్స్ కంటే నేచురల్ పద్ధతలే మన ముఖాన్ని గ్లోగా తయారుచేస్తాయి. ఏమో అనుకుంటాం కానీ స్కిన్ కేర్ అంత సులువైన పని కాదని అందరికీ తెలుసు. చాలామంది ముఖం మీద ఉండే డిస్టబెన్స్ గురించి అనేక క్రీమ్స్ ని వాడుతూ ఉంటారు. కానీ వాటికంటే నేచురల్ పదార్థాలే చాలా మంచిది.

ఎందుకంటే వాటిలో కెమికల్స్ కలవడం వల్ల‌ రాసుకున్నంతసేపు బానే ఉంటుంది కానీ ఆ తర్వాత తీవ్ర ప్రభావాలు చూపిస్తుంది. అయితే శెనగపిండిని ముఖ్యంగా చర్మ సురక్షణకు ఉపయోగిస్తూ వస్తున్నారు. చర్మంపై మొటిమలను తొలగించడానికి చర్మానికి మంచి రంగులు ఇవ్వడానికి శెనగపిండిని సాధారణంగా ఉపయోగిస్తారు. దీనిలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు డైట్ స్కిన్ సెల్స్ ను తగ్గించి చర్మాన్ని సురక్షితంగా ఉంచుతాయి. మరి శెనగపిండి ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1. మూడు టేబుల్ స్పూన్స్ శెనగపిండిని తీసుకుని అందులో చిటికుడు పసుపును, ఒక టీ స్పూన్ ఆలివ్‌ ఆయిల్, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి పేస్ట్ లా తయారు చేయండి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేయండి, 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడగండి. ఆ తర్వాత రిజల్ట్ ని మీరే చూస్తారు.

2. ఒక చెంచా బియ్యప్పిండిని తీసుకుని అందులో ఒక స్పూన్ శెనగపిండిని, కొద్దిగా తేనెను వేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని బ్రష్ తో ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తరువాత ముఖాన్ని గోరువెచ్చని నీళ్లతో కడగండి. ఈ ప్యాక్ ను వారానికి రెండు లేదా మూడు సార్లు అప్లై చేసుకోవచ్చు.

3. మూడు టీ స్పూన్ల శెనగపిండిలో 15.20 టీస్పూన్ల ఓట్ మీల్ పౌడర్, పెరుగు వేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి 15 నిమిషాలు తర్వాత ముఖాన్ని కడగండి. ఈ ప్యాక్ మొటిమలు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది.