ఆడవాళ్లు నైటీలు వేసుకోకూడ‌దా… ఇంత న‌ష్టం జ‌రుగుతుందా…!

ఏదైనా వేడుక, పార్టీ, లేదా సరదాగా బయటికి వెళ్లాలి అన్నా కూడా ఆడవారు ముందుగా రెడీ అవ్వడం మొదలు పెడతారు. సహజంగా ఆడవారికి అలంకారం పై శ్రద్ధ బాగా ఉంటుంది. అలాగే బట్టలు, జ్యువలరీ, మేకప్ ఇలా ఆడవారు రెడీ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఇంట్లో ఉన్నప్పుడు నైట్ డ్రెస్, నైటీ కానీ వేసుకుని సమయాన్ని గడిపేస్తూ ఉంటారు.

ఇంట్లో పనులు ఎక్కువగా ఉండడం వల్ల లేక ఇతర కారణాల వల్ల రెడీ అవ్వడానికి ఇష్టపడరు. దీనితో చాలామంది స్త్రీలు ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఇంట్లో ఎక్కువగా నైటీలు వేసుకునే ఆడవారు కొన్ని విషయాలు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఒకప్పుడు ఇంట్లో ఉన్న కూడా చీరలే ఎక్కువగా కట్టేవారు. ఇవి శరీరంలో కొన్ని భాగాలు పట్టి ఉంచుతాయి. ఈ క్రమంలో కొవ్వు పేరుకోకుండా ఉండేది.

ఇంట్లోనే ఉన్నాం కదా అని చెప్పి చాలామంది స్త్రీలు నైటీలు వేసుకుంటున్నారు. దీనితో శరీరంలో కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. దుస్తులు లూజుగా ఉండడం వల్ల అన్ని భాగాలు దగ్గర కొవ్వు పేరుకు పోతూ ఉంటుంది. చీర కట్టుకునే వారి ఆకృతి చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇక మీదట నుంచి చీరలు ధరించడం అలవాటు చేసుకోండి. లేదంటే కొన్ని రోజుల్లో మీ బాడీని మీరే చూసుకోలేరు.