ఊర్వ‌శి వేసుకున్న నెక్లెస్ రు. 276 కోట్లా… వామ్మో ఇది జోక్ కాదు…!

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా గురించి చెప్ప‌క్క‌ర్లేదు. హాట్‌నెస్‌, బోల్డ్‌నెస్‌కు ఊర్వ‌శి ఎప్పుడూ కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉంటుంది. ఆమె వేసే స్టెప్పులు, వేసుకునే డ్రెస్సులు ఇలా పై నుంచి కింద‌కు ఏం చూసినా కూడా హాట్‌హాట్‌గానే ద‌ర్శ‌న‌మిస్తూ ఉంటుంది. ఈ సంక్రాంతికి వ‌చ్చిన చిరంజీవి వాల్తేరు వీర‌య్య సినిమాలోనూ ఊర్వ‌శి ఐటెం సాంగ్‌లో త‌న అందాలు ఆర‌బోసిన సంగ‌తి తెలిసిందే.

गिरते गिरते बची बॉलीवुड एक्ट्रेस उर्वशी रौतेला, जाने डिटेल…!

తాజాగా ఫ్రాన్స్‌లో జ‌రుగుతోన్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఊర్వ‌శి ప‌లువురు బాలీవుడ్ తార‌లు సంద‌డి చేశారు. ఈ షోలో ఐశ్వ‌ర్యాయ్‌తో పాటు ఊర్వ‌శి కూడా సంద‌డి చేసింది. ఈ వేడుక‌ల్లో ఆమె చేసిన ర్యాంప్ వాక్ అంద‌రిని ఎట్రాక్ట్ చేసింది. మ‌రీ ముఖ్యంగా ఆమె వేసుకున్న క్రోకోడైల్ నెక్లెస్ అయితే స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా ఉంది. ఈ టీమ్ ధ‌ర ఎంత ఉంటుంద‌న్న చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతూ ఉండ‌గా ఆమె టీం ఈ నెక్లెస్ రేటు ఎంత ఉంటుందో చెప్పి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది.

ఊర్వ‌శి పింక్ క‌ల‌ర్ గౌనులో ధ‌గ‌ధ‌గ మెరిసిపోతూ ఆ నెక్లెస్ పెట్టుకుని వ‌స్తుంటే అంద‌రూ ఆమె వైపే చూస్తూ క‌న్నార్ప‌లేదు. కొంద‌రు నెటిజ‌న్లు ఆమె పెట్టుకున్న ముస‌లి నెక్లెస్ పేక్ అయ్యి ఉంటుంద‌ని కామెంట్ చేశారు. అయితే ఈ నెక్లెస్ రేటు ఏకంగా రు. 276 కోట్లు ఉంటుంద‌ని చెప్పారు. ఊర్వశి వేసుకున్న‌ది ఫేక్ నెక్లెస్ కాద‌ని.. దాని రేటు రు. 276 కోట్లు అని చెప్ప‌డంతో ఇప్పుడు అంద‌రూ స్ట‌న్ అయిపోతున్నారు.

Urvashi Rautela Boss Party Song Dance Steps For Waltair Veerayya Movie |  Megastar Chiranjeevi | DSP - YouTube

కొంద‌రు నెటిజ‌న్లు అయితే ఏకంగా నెక్లెస్ ధ‌రే అంత ఉంటుందా ? అని ఫ‌న్నీ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఊర్వ‌శీ రౌతేలే ఒక్క నెక్లెస్‌తో ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియా ఎట్రాక్ష‌న్ త‌న వైపున‌కు తిప్పేసుకుంది.