కారును ఢీకొట్టిన కేసులో హీరోయిన్ డింపుల దూల‌తీరిపోయింది… అడ్డంగా దొరికేసిందిగా…!

తెలుగులో ప‌లు సినిమాల్లో న‌టిస్తూ ఇప్పుడిప్పుడే పాపుల‌ర్ అవుతోన్న హీరోయిన్ డింపుల్ హ‌య‌తి కేసుల మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా ఆమె గోపీచంద్ హీరోగా వ‌చ్చిన రామ‌బాణం సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. అంత‌కు ముందు గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ సినిమాలో ఐటెం సాంగ్‌తో పాటు ర‌వితేజ హీరోగా వ‌చ్చిన ఖిలాడి సినిమాలోనూ న‌టించింది.

ఈ రోజు ఆమె ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్ట‌డంతో పాటు ఆయ‌న‌తో వాగ్వివాదానికి దిగిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనిపై ఎవ‌రి వెర్ష‌న్లు వారు వినిపిస్తున్నారు. ఐపీఎస్ అధికారి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కాలితో తన్నిన ఆమె ఆయ‌న కారును త‌న కారుతో ఢీ కొట్టినట్టు స‌మాచారం. వీరిద్ద‌రు జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నారు.

Tollywood actor Dimple Hayathi booked for hitting IPS officer's car in Hyderabad | Hyderabad News - Times of India

ఈ క్ర‌మంలోనే డింపుల్ హ‌య‌తి కారుతో రాహుల్ కారును ఢీ కొట్టిన‌ట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ హెగ్డే డింపుల్‌కు పలుమార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా డింపుల్‌ తీరు మార్చుకోకుండా ఆయ‌న‌పైనే ఫైర్ అయ్యింద‌ట‌. చివ‌ర‌కు ఆమె మ‌రీ రెచ్చిపోవ‌డంతో ఆమెపై రాహుల్ హెగ్డే డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు.

Dimple Hayathi Damages DCP's Car And Thus A Case Gets Filed On Her At  Jubilee Hills Police Station

దురుసు ప్ర‌వ‌ర్త‌న నేప‌థ్యంలో ఆమెపై గ‌ట్టిగానే కేసులు బుక్ అయ్యాయి. ఐపీసీ 353, 341, 279 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఆమె వెర్ష‌న్ మ‌రోలా ఉంది. డింపుల్ మాట్లాడుతూ రాహుల్ హెగ్డే చాలా దురుసుగా మాట్లాడార‌ని.. డింపుల్ త‌ర‌పు న్యాయ‌వాది చెపుతున్నారు. గ‌త కొద్ది రోజులుగా ఇలాగే జ‌రుగుతోంద‌ని.. ఆమెను వేధించాల‌న్న‌దే డీసీపీ ఉద్దేశం.. అయినా ఆయ‌న క్వార్ట‌ర్స్‌లో ఉండ‌కుండా ఇక్క‌డ ఎందుకు ఉంటున్నార‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ వివాదం ఎలా మ‌లుపులు తిరుగుతుందో ? చూడాలి.