నాగచైతన్య సమంతతోనే కాకుండా ఆ నలుగురు హీరోయిన్లతో కూడా ప్రేమాయణం నడిపాడా… !

టాలీవుడ్ లో బలమైన అక్కినేని కుటుంబ నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని తాత‌, తండ్రి లాగా పేరు తెచ్చుకునేందుకు అక్కినేని నాగచైతన్య చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా నాలుగు మంచి హిట్లు కొట్టిన నాగచైతన్య నటించిన చివరి రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. నాగచైతన్య కెరీర్‌కు మంచి పునాది వేసిన సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమాలో చైతు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.

Samantha, Naga Chaitanya to patch-up? Here's major hint

ఈ సినిమాలో చైతుకు జోడిగా నటించిన సమంతతో తెరమీద కాదు.. బయట కూడా ప్రేమలో పడి చివరకు ఆమెనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నాలుగేళ్ల పాటు కాపురం చేసుకున్న ఈ జంట యేడాదిన్నర క్రితం మనస్పర్ధలు నేపథ్యంలో విడిపోయిన సంగతి తెలిసిందే. ఒక సమంతతోనే చైతు ఏకంగా ఐదు సినిమాలలో నటించాడు. వెండితెరపై సమంత, చైతు జంట అంటే ఎంతో ? క్రేజ్ ఉండేది.

చైతన్యకు ముందు నుంచి రొమాంటిక్ ఇమేజ్ ఉంది. చైతు ఎంతోమంది అమ్మాయిలు కలల రాకుమారుడు. చైతు, సమంతతో మాత్రమే కాదు మరో ముగ్గురు హీరోయిన్లతోను ప్రేమాయణం నడిపాడని ఇండస్ట్రీలో గుసగుసలు అయితే బయటకు వచ్చాయి. చైతు మొదట్లోనే కాలేజీ చదువుతున్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాడట. అయితే తన ప్రేమ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పే ధైర్యం చేయలేకపోయాడు.

Truth About Naga Chaitanya and Sobhita Dhulipala's Romantic Holiday

సమంతతో విడాకులు తర్వాత తెనాలికి చెందిన తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్లతో ఎఫైర్ నడుపుతున్నాడంటూ ఒక్కటే వార్తలు గుప్పుమ‌న్న‌ సంగతి తెలిసిందే. అంతకంటే ముందే బంగార్రాజు సినిమా చేసే టైంలో చైతుకి హీరోయిన్ దక్ష నగార్క‌ర్ కి మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తుందన్న గుసగుసలు కూడా బయటకు వినిపించాయి. ఇక మజిలీ సినిమా చేసే టైంలోనే ఆ సినిమాలో సమంతతో పాటు రెండో హీరోయిన్‌గా చేసిన దివ్యాంక కౌశిక్ తో ప్రేమలో ఉన్నాడని కూడా వార్తలు పుకార్లు షికార్లు చేశాయి.

సరే ఈ వార్తల సంగతి ఎలా ? ఉన్నా చైతుకి ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ అలాంటిది. అందుకే చైతుపై ఏకంగా ఈ తరహా పుకార్లు వచ్చాయి. ఒకటి మాత్రం నిజం సమంతతో విడాకులు తర్వాత శోభితతో చైతు చెట్టపట్టలేసుకొని తిరుగుతూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. మ‌రి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.