ప్రస్తుత రోజుల్లో చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.. సగం షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు కూడా మధ్యలో ఆగిపోతున్నాయి. అలాంటిది సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోవడం ఓ లెక్క..? కానీ స్టార్ హీరోలు సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత సినిమా పూర్తి అయిపోతుంది అని అందరూ అనుకుంటారు. అయితే కొన్ని సినిమాలుకు మాత్రం అలా జరగలేదు. కొన్ని సినిమాలు అధికారకంగా ప్రకటించిన తర్వాత పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నాయి. ఎలాంటి స్టార్ హీరోలు ఉన్న సినిమాలకు కూడా ఒక్కోసారి ఇలాంటి తిప్పలు తప్పవు.
మరీ ముఖంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ణ్ లాంటి అగ్ర హీరోల సినిమాలు సైతం అధికరికంగా ప్రకటించి షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత అనుకోని కారణాలతో సినిమాలు ఆగిపోయాయి.. అలా ఆగిపోయిన వాటిలో రాంగోపాల్ వర్మతో చిరంజీవి సినిమా ఉంది.. బిగోపాల్ తో బాలయ్య సినిమా ఉంది.. పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఉన్నాయి.. కొన్ని అనుకోని కారణాలతో ఈ సినిమాలో షూటింగ్ మొదలవకుండానే పక్కకు వెళ్లిపోయాయి. అసలు ఆ సినిమాలు ఏమిటి ఎప్పుడు ఆగిపోయాయి అనేది ఇక్కడ చూద్దాం.
ముందుగా పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి పూజా కార్యక్రమాలు ముగించుకొని తర్వాత అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. బాలకృష్ణ నర్తనశాల ఏకంగా 15 రోజులు షూటింగ్ పూర్తి అయిన తర్వాత సినిమా ఆగిపోయింది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయిందో అక్కడి వరకు ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయ్యగా అందుకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. రామ్ చరణ్ మెరుపు సినిమా కూడా కొన్ని రోజుల షూటింగ్ జరుపుకుని తర్వాత అనుకొని కారణాలతో ఆగిపోయింది.
పవన్ కళ్యాణ్ సీనియర్ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు జీసెస్ క్రైస్ట్ సినిమా అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది. ఇక అదే విధంగా కొరటాల శివ- రామ్ చరణ్ సినిమా ముహూర్తం తర్వాత ఆగిపోయింది. అదేవిధంగా చిరంజీవి- రామ్ గోపాల్ వర్మ వినాలని ఉంది సినిమా కొన్ని రోజులు షూటింగ్ తర్వాత ఆగిపోయింది. చిరంజీవి అబు బాగ్ధాద్ గజదొంగ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఏవేవో కారణాలతో ఈ సినిమా అక్కడే ఆగిపోయింది. ఇక రవితేజ- మెహర్ రమేష్ కాంబినేషన్లో అనౌన్ చేసిన పవర్ సినిమామా కూడా అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది.
ఇక వెంకటేష్ మారుతి కాంబోలో బాబు బంగారం సినిమా తర్వాత రాధా అనే టైటిల్ తో ఓ సినిమా కూడా అనౌన్స్ అయింది. ఆ సినిమా టైటిల్ వరకే వచ్చి ఆగిపోయింది. ఇక బాలయ్య – దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో హర హర మహాదేవ అనే సినిమా పూజా కార్యక్రమాలు ముగించుకుని ఆ తర్వాత ఆగిపోయింది. బాలయ్య విక్రమ సింహ భూపతి 80% షూటింగ్ పూర్తి అయిన తర్వాత నిర్మాత మరణించడంతో ఈ సినిమా అక్కడే ఆగిపోయింది. ఈ సినిమాలే కాకుండా మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నోసినిమాలు షూటింగ్ మొదలై మొదలవక ఆగిపోయాయి.