అదిరిపోయింది గా పులి వేటకు వచ్చే సమయం చేసింది గురు.. నందమూరి అభిమానులకు పండగే పండుగ..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం చిత్ర పరిశ్రమ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందనే చెప్పాలి. ఎప్పుడు ఎప్పుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడా అని నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. కానీ అది మాత్రం ఎప్పటికీ జరగడం లేదు. బాలకృష్ణ- మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఏదో ఒక విషయం చెబుతూ వస్తున్నాడు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని, ఓ మంచి డైరెక్టర్ తో ఎంట్రీ ఇస్తాడని చెబుతూ అభిమానులు ఆశలు రేపుతూ వస్తున్నాడు.

మరోపక్క మోక్షజ్ఞ ఇంకా హీరోకు సరిపడే విధంగా లేడని బొద్దుగా ఉన్నాడని, లుక్స్ హీరోలా లేవని విమర్శలు కూడా వచ్చాయి. అంతేకాకుండా కొంత టైం తీసుకుని మళ్ళీ హీరోలా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు కూడా వచ్చాయి. రీసెంట్‌గా మోక్షజ్ఞ లుక్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు ఎంతో స్లిమ్ గా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.
ఇప్పుడు ఈ నందమూరి వారసుడు తండ్రి సినిమా సెట్ లో ప్రత్యక్షమయ్యాడు.

బాలయ్య- కాజల్ జంటగా నటిస్తున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా భగవంత్‌ కేసరి.. టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీలా కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ మూవీ షూటింగ్‌ స్పాట్లో మోక్షజ్ఞ తళుక్కున మెరిశాడు. అందుకు సంబంధించిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఈ సెట్ లో మోక్షజ్ఞ లుక్ ఎంతో ఎంతో మెస్మరైజ్ చేస్తుంది. కుర్ర హీరోకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ నందమూరి వారసుడులో కనిపిస్తున్నాయి. బరువు తగ్గీ, ముఖంలో తేజస్సుతో కలకలాడుతున్నారు. గాగుల్స్‌ పెట్టుకుని స్టైలిష్ గా అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఫోటోలు చూసిన నందమూరి అభిమానులు.. అదిరిపోయిందిగా పులి వేటకు వచ్చే సమయం వచ్చేసింది అంటూ.. పులి ఎంట్రీ ఎప్పుడు అని అడుగుతున్నారు.. మరి ఈ సంవత్సరం అయినా ఈ నందమూరి వారసుడు టాలీవుడ్ లో అడుగుపెడతాడా.. లేదా అనేది చూడాలి.