కమెడియన్ ఆలీ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాని వదులుకున్న మహేష్.. ఇంతకీ సినిమా ఏమిటంటే..!?

టాలీవుడ్ సీనియర్ స్టార్ కమెడియన్ ఆలీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆలీ ప్రస్తుతం టాలీవుడ్ లోనే అగ్ర కమెడియన్గా ఎదిగాడు. ఆలీ నటనకు ఆయన కామెడీకి ఎందరో అభిమానులు కూడా ఉన్నారు. ఆయన కామెడీ టైమింగ్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ హీరోగా కూడా నటించాడు. ఇక ఆలీ యమలీల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా 1994లో ప్రేక్షకు ముందుకు వచ్చింది. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఆలీ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సినిమా తర్వాత ఆలీ హీరోగా కన్నా కమెడియన్ గానే ఎక్కువ సినిమాల్లో నటిస్తూ వచ్చాడు. అయితే ఈ సినిమాలో హీరోగా అలీ కన్నా ముందు మరో స్టార్ హీరోతో చేయాలని దర్శకుడు భావించారట. అయితే ఆ హీరో వయసు చాలా తక్కువగా ఉండటంతో ఇప్పుడు చేయనని చెప్పుకొచ్చారట. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు.

ఎస్వీ కృష్ణారెడ్డి ముందుగా ఈ సినిమా స్టోరీని మహేష్ తండ్రి కి కృష్ణ గారికి చెప్పారట. ఇక దాంతో కృష్ణ ఒకసారి మా అబ్బాయిని వచ్చి చూడండి అని చెప్పడంతో కృష్ణారెడ్డి వెళ్లి మహేష్ ని చూసేసరికి చిన్న వయసులోనే ఉన్నాడట. ఆ సమయంలో మహేష్ కి నటన పరంగా ఎలాంటి మెచ్యూరిటీ లేకపోవడంతో ఇతను సినిమాల్లోకి రావడానికి కనీసం ఇంకో రెండు సంవత్సరాలు స‌మ‌యం ప‌ట్టే అవకాశం ఉంది. అప్పుడే మీరు ఇతన్ని సినిమాల్లోకి తీసుకురావాలని కృష్ణారెడ్డి, కృష్ణ గారికి చెప్పారట.

దీంతో కృష్ణ కూడా ఇప్పుడు మహేష్ ని సినిమాల్లోకి తీసుకురావాలని లేదు అని చెప్పారట. ఇక మహేష్ బాబుని వద్దనుకున్న తర్వాత ఈ సినిమాలో హీరోగా చాలా మందిని ఎంపిక చేసుకుని నటన సరిగ్గా లేకపోవడంతో వారిని రిజెక్ట్ చేశారట. ఫైనల్ గా ఆలీ నటన బాగుండడంతో ఆలీని ఈ సినిమాలో హీరోగా ఫైనల్ చేశారట. దీంతో మహేష్ బాబు హీరోగా చేయాల్సిన సినిమాలో ఆలీ హీరోగా వ‌చ్చింది.’