బాలకృష్ణ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే..

కొందరు హీరోలు చేసిన సినిమాలు బాగా హిట్ అవుతాయి. అయితే ఆ స్టోరీలను ముందుగా దర్శకులు వేరే హీరోలకు చెప్పి ఉంటారు. బహుశా వారికి కథ నచ్చకో, లేక అంతగా ఆకట్టుకోలేదని భావించో ఆ సినిమాను ఆ హీరోలు పట్టించుకోరు. ఒక్కోసారి ఆ సినిమా కథలు తమకు అంతగా నప్పలేదని కూడా భావించడం ఓ కారణం. ఏదేమైనా ఆ సినిమాలు వేరే హీరోలు చేసినప్పుడు అవి బ్లాక్ బస్టర్లుగా నిలుస్తాయి. అప్పుడు ఆ సినిమాలు తాము చేసి ఉంటే బాగుండేదనే అనిపిస్తుంటుంది. ఇలా నటసింహం బాలకృష్ణ వదిలేసిన కొన్ని సినిమాలను వేరే హీరోలు చేసి మంచి హిట్లు అందుకున్నారు. బాలకృష్ణ వదిలేసిన సినిమాల గురించి పరిశీలిద్దాం.

జూనియర్ ఎన్టీఆర్ చేసిన స్టూడెంట్ నంబర్.1 సినిమాను తొలుత బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని, ఆయనతో సినిమా చేయాలని రాజమౌళి భావించారు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో, బాలయ్యను అందులో ప్రొఫెసర్‌గా చూపించాలని ఆయన అనుకున్నారు. కుదరకపోవడంతో కథలో చిన్న మార్పులు చేసి, జూనియర్ ఎన్టీఆర్‌తో రాజమౌళి తెరక్కించారు. ఇక వెంకటేష్ హీరోగా వచ్చిన సూర్యవంశం సినిమా కూడా బాలయ్య చేయాల్సింది.

డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు చెప్పిన కథ నచ్చక ఆ సినిమా బాలకృష్ణ చేయలేకపోయారు. ఇక వెంకటేష్ ఆ సినిమా చేసి, ఓ సూపర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్నాడు. హీరో రాజశేఖర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా సింహరాశి కూడా బాలకృష్ణ చేయాలి. డైరెక్టర్ సముద్ర చెప్పిన కథను బాలకృష్ణ రిజెక్ట్ చేయడంతో ఆ సినిమా హీరో రాజశేఖర్ వద్దకు వెళ్లింది. దాంతో కెరీర్‌లోనే సింహరాశి సినిమా రాజశేఖర్‌కు చక్కటి విజయాన్ని అందించింది. వెంకటేష్ చేసిన నాగవల్లి, పవన్ కళ్యాణ్ చేసిన అన్నవరం సినిమాలు కూడా కథలను దర్శకులు తొలుత బాలయ్యకే చెప్పారు. ఆయన రిజెక్ట్ చేయడంతో వాటిని హీరోలతో దర్శకులు తెరకెక్కించారు.

Tags: actress, Bala krishna, fans, list, not done, rajashekhar, Tollywood, Venkatesh