BiggBoss 6 కి దారుణమైన రేటింగ్.. బిగ్ షాక్..!

BiggBoss 6 : బిగ్ బాస్ సీజన్ 6 అట్టహాసంగా మొదలైంది. బిగ్ బాస్ రియాలిటీ షోకి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. కొంతమందిని ఓ ఇంట్లో ఉంచి బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ఆట ఆడాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లు కూడా ఆడి గెలవాల్సి ఉంటుంది. అయితే బిగ్ బాస్ 6 లాంచింగ్ ఎపిసోడ్ భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఈ ఎపిసోడ్ కి పెద్ద ఎత్తున రేటింగ్ వస్తుందని భావించారు. కానీ అనుకున్నంత రేంజ్ లో రాలేదు.

అదే రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్న కారణంగా బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ ఎవరు చూడలేదు. సో ఆ ఎఫెక్ట్ రేటింగ్ మీద పడ్డది. బిగ్ బాస్ 6 లాంచింగ్ ఎపిసోడ్ దారుణమైన రేటింగ్స్ వచ్చాయి. ఎప్పుడు భారీ రేటింగ్ వచ్చే బిగ్ బాస్ మొదటి ఎపిసోడ్ కి ఈసారి చాలా తక్కువ రేటింగ్ వచ్చంది.

నాగార్జున హోస్ట్ గా చేస్తున్న BiggBoss 6 మొదటి ఎపిసీడ్ కి 8.5 రేటింగ్ మాత్రమే వచ్చింది. అంతకుముందు సీజన్ల కన్నా ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. గత మూడు సీజన్లుగా 15 నుంచి 20 రేటింగ్స్ రాగా ఈసారి చాలా తక్కువ రేటింగ్ రావడంతో బిగ్ బాస్ మేకర్స్ షాక్ అయ్యారు. షో ని ఇంట్రెస్టింగ్ గా మలచడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags: BiggBoss, BiggBoss 6, BiggBoss Rating, nagarjuna, Star Maa