Samantha : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఓ మంచి లవ్ స్టోరీ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ టైం లో చిత్రయూనిట్ కి సమంత వల్ల ఇబ్బందులు వస్తున్నాయట. తెలుగుతో పాటుగా సమంత హిందీ సినిమాల్లో కూడా నటిస్తుంది.
ఖుషి సినిమా కోసం సమంత డేట్స్ అడ్జెస్ట్ చేయడం కుదరట్లేదట. వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఖుషి సినిమాకు ఆమె సరైన టైం కేటాయించలేకపోతుందని తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ కి సమంత డేట్స్ అడిగితే కుదరదని చెప్పిందట. ఇలాంటి సమస్య వస్తుందని తెలిస్తే సమంత బదులుగా వేరే హీరోయిన్ ని అయినా తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ సినిమా రెండు షెడ్యూళ్లు అయ్యాక సమంత ఖుషి యూనిట్ ని ఇబ్బంది పెడుతుంది.
అయితే తను సినిమా చేయనని చెప్పట్లేదు కానీ వారు అడిగిన డేట్స్ కాకుండా తనకు కంఫర్ట్ ఉన్న డేట్స్ ఇస్తానని అంటుందట. మరి ఖుషి సినిమా కోసం సమంత ఎప్పుడు డేట్స్ ఇస్తుందో చూడాలి. లైగర్ ఫ్లాప్ అవడంతో తన ఫోకస్ మొత్తం ఖుషి మీద పెట్టాడు.