సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న మహేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 4 దశాబ్దాలు అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
ఈరోజు మహేష్ బాబు 48వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఓ న్యేస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు మేకప్ లేకుండా ఓ సినిమాలో నటించారట. మహేష్ ఎంత సాఫ్ట్ నేచర్ కలిగి సింపుల్ గా ఉంటాడో అందరికీ తెలుసు. అదే అయనలో ఈగోను టచ్ చేస్తే వైల్డ్ యాంగిల్ బయటపడుతుందట. ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తూ నిజం సినిమాను తీసుకువచ్చారు. రక్షిత హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్‌తో తెరకెక్కింది.
ఈ సినిమాలో మొదట మహేష్ బాబు చాలా సాఫ్ట్‌గా అమ్మ కొంగు చాటు కొడుకుగా ఈ కథలో మనకు మహేష్ బాబు కనిపించాడు. వాళ్ళ నాన్నను అనవసరంగా జైలు పాలు చేశారని తెలిసి తనలోని వైల్డ్ నేచర్‌ని మహేష్ బాబు ఎలా బయటకు తెచ్చాడో మనం చూసాం. అయితే ఈ సినిమాకు నాచురల్‌గా కనిపించాలని ఉద్దేశంతో మహేష్ బాబు అసలు మేకప్ ఏ వేసుకో లేదట. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా మహేష్‌కి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.