చిరంజీవి ఇంట్లో బాలకృష్ణ సినిమా షూటింగ్ చేసిన మూవీ ఏమిటో తెలుసా..!?

మెగాస్టార్ చిరంజీవి, నట‌సింహం నందమూరి బాలకృష్ణ మన టాలీవుడ్ లోనే గత నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు.. అదే విధంగా 40 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో పోటీ పడుతూ వస్తున్నారు. ఈ సంక్రాంతి కూడా ఈ ఇద్దరు తమ సినిమాలతో పోటీపడ్డారు. బాలయ్య వీరసింహారెడ్డి, చిరు వాల్తేరు వీరయ్యతో వచ్చి ఇద్దరూ తమ సినిమాలతో విజయం సాధించారు.

ఈ విషయం పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో ప్రత్యర్థులుగా ఉన్న వీరిద్దరు వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. ఈ క్రమంలోనే బాలయ్య నటించిన ఓ సినిమా షూటింగ్‌ను దాదాపు చిరంజీవి ఇంట్లోనే తెర‌కెక్కించారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన సూపర్ హిట్ సినిమా షూటింగ్ దాదాపు చిరంజీవికి సంబంధించిన ఓ గెస్ట్ హౌస్ లోనే జరిగింది. ఇక ఈ సినిమా విడుదలై దాదాపు 33 సంవత్సరాలు కావస్తుంది. ఇంత‌కి ఆ సినిమా మరేదో కాదు నారీ నారీ నడుమ మురారి.

ఈ సినిమా బాలయ్య, సీనియర్ దర్శకుడు ఏ. కోదండరామరెడ్డి కాంబోలో వచ్చిన ఏడో సినిమా.. అలాగే నట‌సింహం బాలయ్యకు హీరోగా ఇది 50వ సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. 1988 సెప్టెంబర్‌లో యువచిత్రర బ్యానర్ లో తెరకెక్కిన జానకి రాముడు సినిమాకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్, శివశక్తి దత్తాతో కలిసి నారీ నారీ నడుమ మురారి సినిమాకి కథ చర్చలు ప్రారంభించారు నిర్మాత మురారి.

ఇక ముందుగా ఈ సినిమాలో హీరోయిన్లుగా భానుప్రియ చెల్లెలు శాంతి ప్రియ తో పాటు సీతను అనుకున్నారు.. ఆత‌ర్వాత శాంతి ప్రియ, సీత ప్లేసులో శోభన, నిరోషాలను హీరోయిన్లుగా తీసుకున్నారు. ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకంగా కూడా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణను పూర్తిగా ఫ్యామిలీ అండ్ క్లాస్ హీరోగా చూపించారు. ఒక్క ఫైట్ కూడా ఈ సినిమాలో లేకపోవడం మరో విశేషం. డిసెంబర్ 3 1989లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

ఈ సినిమాని ముఖ్యంగా చెన్నైలోని వేల్చరి ప్రాంతంలో చిరంజీవి గెస్ట్ హౌస్ లో చిత్రీకరించారు. ఆ హౌస్ పేరు హనీ హౌస్ దాని పక్కనే ఉన్న రెండు ఎక‌ర‌ల‌ స్థలం కూడా చిరంజీవిదే. ఈ ప్లేస్ లోనే బాలయ్య నారీ నారీ నడుమ మురారి సినిమాకి సంబంధించిన 90 శాతం షూటింగ్ జరగడం మరో విశేషం. ఆ రోజుల్లో బాలయ్య- చిరంజీవి ఎంతో స్నేహంగా ఉంటూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఇండస్ట్రీకి గొప్పగా నిలిచారు.