ఎన్టీఆర్, ఏఎన్నార్‌కు కోపం తెప్పించిన దర్శకుడు… ఇక్కడ మరో గమ్మత్తు తెలిస్తే న‌వ్వు ఆగదు..!

మన తెలుగు చిత్ర పరిశ్రమకే దిగ్గజ నటులైన‌ ఎన్టీఆర్- ఏఎన్నార్ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలా వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలలో భూకైలాష్ కూడా ఒకటి.. అప్పటి అగ్ర నిర్మాణ సంస్థ అయిన ఏవీఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఎస్వీ రంగారావు, జమున కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాలో మొదటిసారిగా ఎన్టీఆర్ రావ‌ణుడి పాత్రలో కనిపించారు. ఇక అలాగే అక్కినేని నాగేశ్వరరావు కూడా నారదుడు పాత్రలో కనిపించారు.

1958లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి హిట్‌గా నిలిచింది. ఈ సినిమాని కే. శంకర్ దర్శకత్వం వహించగా, ఎడిటర్ గా కెరీర్ మొదలుపెట్టిన శంకర్ కి ఇది రెండో సినిమా కావటం మరో విశేషం.. అంతేకాకుండా ఈ చిత్రాన్ని ఇటు తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో అటు కన్నడలో రాజకుమార్, కళ్యాణ్ కుమార్‌తో ఒకే సమయంలో తెరకెక్కించారు. ఇలా రెండు సినిమాకే ఇంత మంది అగ్ర హీరోలను హ్యాండిల్ చేయడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి.

అలాంటి పెద్ద స్టార్ హీరోలతో ఒకే సమయంలో సినిమా చేస్తున్న సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయిగా.. అలాంటి ఒక సమస్య దర్శకుడు శంకర్ కి కూడా వచ్చింది. ఈ సినిమాలో సముద్రం ఒడ్డున సూర్యోదయం సమయంలో ఒక సీన్ షూటింగ్ చేయాలనుకున్నారు. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్- ఏఎన్నార్ ఇద్దరూ కలిసి నటించాల్సి ఉంటుంది. ఆ సీన్ షూటింగ్ కోసం హీరోలు ఇద్దరినీ మేకప్ వేసుకొని ఉదయం 5 గంటలకు ముందే షూటింగ్స్ స్పాట్లో ఉండాలని.. ఇదే విషయాన్ని దర్శకుడు ఇద్దరు హీరోలతో చెప్పగా వాళ్ళు సరే అన్నారు.

సమయాన్ని కరెక్ట్ గా పాటించే వీరిద్దరూ 5:00 కన్నా ముందే షూటింగ్ లోకేషన్ కు వచ్చేసారు. కానీ అక్కడ మూవీ యూనిట్ ఎవరూ లేరు. ఉదయం 6 గంటలు అయినా ఎవరూ రాలేదు. దీనికి హీరోలు ఇద్దరు తప్పు లోకేషన్ కి వచ్చామేమో అనుకుంటూ తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని భావించారు.. అదే సమయంలో డైరెక్టర్ కారులో నుంచి దిగాడు. అక్కడ వారిద్దరిని చూసిన దర్శకుడు పరిస్థితి ఏం చేయాలో అర్థం కాక హుటాహుటిన కారు దిగి వెంటనే ఇద్దరి కాళ్ల మీద పడి పొరపాటు జరిగింది క్షమించండి అంటూ వేడుకున్నాడట. ఆ హీరోలు ఇద్దరు కూడా శాంతించి చివ‌రికి స‌ముద్రపు ఒడ్డున ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశారు.