రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా చాలా మంది సోదర సోదరీమణులు ఘనంగా ఈ పండుగను జరుపుకున్నరు. పేద ధనికానే తేడా లేకుండా ఈ పండగను ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు రాఖీ పండగను జరుపుకుంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది అన్నా చెల్లెలు రాఖీలు కట్టుకున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి వారి అభిమానులతో పంచుకున్నారు.
అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్‌కి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా రాఖీ కట్టినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్- జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య బాండింగ్ ఏ విధంగా ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి హీరోలు తమ పుట్టిన రోజులకు అలాగే సినిమా హిట్ అయినప్పుడు.. రీసెంట్గా బన్నీకి ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు వచ్చినప్పుడు.. ఎన్టీఆర్ స్పెషల్ గా బావ అంటూ ట్వీట్ చేసిన విషయాలు మనకు తెలిసింది.
వీరిద్దరూ ఒకరిని ఒకరు బావ అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటూ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్‌ను అల్లు అర్జున్ బావ అని పిలిస్తే లక్ష్మీ ప్రణతికి అన్నయ్య వరుస అవుతాడు.. కాబట్టి లక్ష్మీ ప్రణతి, అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అల్లు అర్జున్‌కి రాఖీ కట్టిందట. లక్ష్మీ ప్రణతియే ఇంటికి వెళ్లి సప్రైజ్ ఇచ్చింది అంటే అల్లు అర్జున్ మాత్రం లక్ష్మి ప్రణతికి ఆశ్చర్యపోయి ఒక ఖరీదైన భారీ గిఫ్ట్ నైతే ఇచ్చారట.
బన్నీ ఇచ్చిన ఆ ఖరీదైన బహుమతిని చూసి జూనియర్ ఎన్టీఆర్ సైతం ఆశ్చర్యపోయారట. అల్లు అర్జున్ తన చెల్లెలు లక్ష్మీ ప్రణతి ప్రేమతో రాఖీ కట్టినందుకు ఒక డైమండ్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ డైమండ్ వాచ్ విలువ దాదాపు కోటి రూపాయలు పైనే ఉంటుందట. ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయం తెలిసిన అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.