నిహారిక‌ను పూర్తిగా దూరం పెట్టేసిన మెగా ఫ్యామిలీ… కోపంతో నాగ‌బాబు ఆ ప‌ని కూడా చేశాడా..!

మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక త‌న భ‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో దూరంగా ఉంటోంద‌ని.. వీరిద్ద‌రు త్వ‌ర‌లోనే విడాకులు కూడా తీసుకోబోతున్నారంటూ ఒక్క‌టే వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త రెండు నెల‌లుగా సోష‌ల్ మీడియాలో ఇది ఎంత పెద్ద సంచ‌ల‌న వార్త‌గా మారిందో చూశాం. కార‌ణాలు ఏవైనా వీరిద్ద‌రు దూరంగా ఉంటున్నారు.

పైగా ఒక‌రి సోష‌ల్ మీడియా అక్కౌంట్ల‌ను మ‌రొక‌రు అన్ ఫాలో చేసుకున్నారు. దీనికి తోడు ఒక‌రి అక్కౌంట్ల‌లో మ‌రొక‌రి ఫొటోలు కూడా డిలీట్ చేసేశారు. విడాకుల వార్త‌ల‌పై నిహారిక ఏ మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. అయితే భ‌ర్త‌కు దూరంగా ఉండ‌డంతో పాటు ఇటు ఇష్టం వ‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. హాట్ హాట్ ఫొటోల‌తో సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.

ఇటు వెబ్‌సీరిస్‌లు చేస్తోంది. నిర్మాత‌గా మారేందుకు ఆఫీస్ కూడా స్టార్ట్ చేసింది. ఆమె భ‌ర్త‌కు దూరంగా ఉండ‌డం మెగా ఫ్యామిలీలో ఎవ్వ‌రికి న‌చ్చ‌లేద‌ని.. ఆమె తీరు న‌చ్చ‌కే మెగా ఫ్యామిలీ కుటుంబ స‌భ్యులు ఆమెను దూరం పెడుతున్నార‌ని కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అందుకే నిహారిక కూడా కుటుంబ స‌భ్యుల‌తో సంబంధం లేకుండానే సొంతంగా నిర్ణ‌యాలు తీసుకుంటోంద‌ని.. ఓన్‌గానే టూర్లు వేస్తోంద‌ని అంటున్నారు.

అటు నిహారిక తండ్రి నాగ‌బాబు కూడా ఆమె చేస్తోన్న ప‌నుల‌పై ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అటు పెద‌నాన్న చిరంజీవి సైతం ఆమెను క‌న్విన్స్ చేసేందుకు విఫ‌ల‌య‌త్నం చేశాడంటున్నారు. అందుకే మునుప‌టిలా నిహారిక‌ను నాగ‌బాబుతో పాటు మెగా కుటుంబ స‌భ్యులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె మ‌రింత ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కూడా టాక్ ?

Tags: celebrities news, divorce, jonnalagadda chaithanya, latest film news, latest filmy updates, latest news, niharika, social media, Star hero, Star Heroine, telugu news, Tollywood, viral news