ప్రాణంగా ప్రేమించిన స్టార్ హీరోకే అమ్మగా నటించిన స్టార్ హీరోయిన్..!

ఒకప్పటి మలయాళీ సీనియర్ హీరోయిన్ శ్రీవిద్య గురించి అందరికీ తెలిసిందే. ఇక ఆమె మళయాల చిత్ర పరిశ్రమ నుంచి వచ్చినప్పటికీ అచ్చం తెలుగింటి ఆడపడుచు లాగా ఉంటూ టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక మరి ముఖ్యంగా ఈమె లోకనాయకుడు కమలహాసన్ తో చాలా సినిమాల్లోలో నటించింది. ఇప్పుడు తాజాగా ఈమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఆ విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక కమలహాసన్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో వివాదాలు ఉన్నాయి.. మరి ముఖ్యంగా ఎందరో హీరోయిన్ల విషయంలో కమల్‌పై కమల్ పై ఎన్నో నెగటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఎంతమంది హీరోయిన్లతో కమలహాసన్ ప్రేమించి డేటింగ్ చేసినచేశాడు.ఆ లిస్టు కూడా చాలానే ఉంది. ఇప్పుడు ఈ లిస్ట్‌ లోకి వస్తుంది హీరోయిన్ శ్రీవిద్య.

ఇక ఈ హీరోయిన్ కమలహాసన్ ను ఎంతగా ప్రేమించిందో అందరికీ తెలిసిందే.. ఇక ఇదే విషయంపై శ్రీవిద్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఆయన్ని ఎంతగానో ప్రేమిస్తే ఆయన మాత్రం మరో హీరోయిన్ల మోజులో పడటంతో ఆయన్ని ప్రేమించడం మానేశాను. అయితే కమలహాసన్‌తో బ్రేకప్ అయిన సమయంలో నాకు మెచ్యూరిటీ లేదు. కానీ క్షమించగలిగే గుణం మాత్రం చాలా ఉంది.

ఎందుకంటే కమలహాసన్‌తో బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి ఓ సినిమాలో ఆయనకు తల్లిగా నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలో నా స్థానంలో మరెవరు ఉన్న అలా చేయరు. కానీ నాకు క్షమాగుణం ఎక్కువ అందుకే అతన్ని క్షమించి నా పని నేను చూసుకుంటూ ఆ సినిమాలో కమల్‌కు తల్లిగా నటించాను. ఈ విధంగా తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తితోనే అమ్మ అని పిలిపించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.