భోళా శంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తమన్నా హాజరు కాకపోవడానికి కారణం అదేనా..?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా భోళాశంకర్. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్, అక్కినేని సుశాంత్ కిరోల్ ప్లే చేశారు. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్గా జరిగింది. ఈ సినిమాలో కీర్తి సురేష్, చిరంజీవితో పాటు సినిమాకు సంబంధించిన వారందరూ హాజరయ్యారు.

కానీ హీరోయిన్గా నటించిన తమన్నా మాత్రం ఈ వింట్‌కు హాజరు కాకపోవడంతో మెగా ఫాన్స్ తమ అభిమాన హీరో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎందుకు హాజరు కాలేదంటూ తమన్న కి ట్విట్ పై ట్విట్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. తమన్నా భోళాశంకర్ ఈవెంట్ కు రాకపోవడానికి వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉందట.

నిన్న ముంబైలో తమన్నా మరో ఈవెంట్లో పాల్గొనవలసి వచ్చిందట. ఆ ఈవెంట్లో పాల్గొనడం వల్ల తమన్నకు భోళా శంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రావడం కుదరలేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిన్న తమన్నా ముంబైలో మేకప్ ఆర్టిస్ట్ ఫ్లోరియన్ హిరెల్ సెలూన్ షాప్ ను మొట్ట మొదటిసారిగా ఓపెనింగ్ చేయడానికి వెళ్లాల్సి వచ్చిందని.. ఈ కారణంతోనే తమన్నా రాలేదంటూ సమాచారం. తమన్నా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోయినా ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఈవెంట్స్ లో హుషారుగా పాల్గొంది.