టాలీవుడ్ లో సెన్సేషనల్ రికార్డ్ సృష్టించిన‌ మహేష్ బాబు మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. వయసు మీద పడుతున్న… యంగ్ లుక్స్ తో ఎప్పటికప్పుడు సినీ రంగంలో దూసుకుపోతున్నాడు. మహేష్ బాబు హీరోగా అందాల నటి శృతి హాసన్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ శ్రీమంతుడు. 2015లో ప్రేక్షకుల ముందుకి వచ్చి థియేటర్ల వద్ద హిట్ టాక్‌ని అందుకుంది.

అప్పట్లో నాన్ బాహుబలి సక్ససర్‌గా నిలిచిన శ్రీమంతుడు అనేక ఏరియాల్లో భారీ స్థాయి కలెక్షన్స్‌ని కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలో హర్ష పాత్రతో తన అద్భుత యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే అసలు విషయం ఏమిటంటే.. తాజాగా శ్రీమంతుడు మూవీ యూట్యూబ్‌లో మైత్రి మూవీ మేకర్స్ వారి ఛానల్లో పోస్ట్ చేశారు.

ఇది ఏకంగా 200 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. యూట్యూబ్లో తెలుగు సినిమాల్లో 200 మిలియన్ వ్యూస్ తో పాటు 834కె లైక్స్ ని కూడా సొంతం చేసుకున్న శ్రీమంతుడు మూవీ. ఈ రికార్డ్ అందుకున్న తొలి టాలీవుడ్ మూవీ గా నిలిచింది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించారు.