తెనాలి సీటు నాదెండ్ల‌కు… ఆల‌పాటికి ఆ రెండు ఆప్ష‌న్లే మిగిలాయ్‌…!

తెలుగుదేశం పార్టీకి పార్టీతో జనసేన పొత్తు ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో కొందరు తెలుగుదేశం పార్టీ కీలక నేతలు తమ సీట్లు త్యాగం చేయటం లేదా.. తమ సీటు వదులుకొని మరోచోట పోటీ చేయటం చేయక తప్పని పరిస్థితి. ఇప్పుడు గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి ఆలపాటి రాజా పరిస్థితి కూడా ముందు నుయ్యి… వెనుక గొయ్యి అన్నట్టుగానే ఉంది.

గతంలో వేమూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆలపాటి వేమూరు ఎస్సీలకు రిజర్వుడు కావడంతో తెనాలికి మారారు. 2009 – 2019 ఎన్నికలలో తెనాలిలో ఓడిన రాజా 2014లో విజయం సాధించారు. అయితే జనసేనతో పొత్తు నేపద్యంలో ఆ పార్టీ కీలక నేత జనసేనలో నెంబర్ 2 మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు ఇక్కడ‌ నుంచి సీటు కేటాయించక తప్పని పరిస్థితి.

జనసేనతో పొత్తు ఉంటే కచ్చితంగా తెనాలి మనోహర్ కి ఇవ్వాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు ఉండవు. అయితే రాజాను పార్టీ అధిష్టానం ఇప్పటికే గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇక్కడ రెండుసార్లు గెలిచిన గ‌ల్లా జ‌య‌దేవ్‌ ఈసారి ఎన్నికలలో పోటీ చేయరని అంటున్నారు.

అయితే రాజా మాత్రం తాను ఎమ్మెల్యే గానే పోటీ చేస్తానని చెబుతున్నారట. రాజా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పట్టుబడితే ఆయనకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మాత్రమే ఆప్షన్ గా ఉంది. అయితే అక్కడ కూడా చాలామంది నేతలు ఖ‌ర్చీఫ్‌ వేసుకొని ఉన్నారు మరి రాజా ఫ్యూచ‌ర్‌ ఎలా ? ఉంటుందో చూడాలి.