అరెస్టు సంద‌ర్భంగా చంద్ర‌బాబు సంచ‌ల‌నం… త‌న‌పై కుట్ర గుట్టు ర‌ట్టు చేశారుగా..!

తన అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అణిచివేస్తున్నారని.. అర్థరాత్రి వచ్చి పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారంటూ మండుపడ్డారు. నేనేం తప్పు చేశాను.. ఆధారాలు ఏవి అని అడిగా ? ఎందుకు అరెస్టు చేస్తున్నారు ? చెప్పాల్సిన బాధ్యత ఎవ‌రిపై లేదా ? ఏ తప్పు చేశానో చెప్పకుండా అరెస్టు చేస్తున్నారు.. ప్రజా సమస్యలపై పోరాడకుండా ప్రణాళిక ప్రకారం అరెస్టు చేస్తున్నారు.. ఎవరు ఎన్ని కుట్రలు ప‌న్నిఆ అంతిమంగా న్యాయమే గెలుస్తుందని చంద్రబాబు తెలిపారు.

అంత‌కు ముందు చంద్రబాబు నాయుడు ను పోలీసులు అరెస్టు చేశారు. తొలుత నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆయన బస్సు చేసిన బస్సు వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు కు సంబంధించి చంద్రబాబును అరెస్టు చేసినట్టు సిఐడి పోలీసులు తెలిపారు. అరెస్ట్ కు సంబంధించిన పత్రాలపై చంద్రబాబు సంతకం చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన కాన్వాయలోనే ఎన్ ఎస్ జి భద్రత క‌ల్పించి విజయవాడకు తరలించనున్నారు.

చంద్రబాబు అరెస్టుపై ఆయన తరపు న్యాయవాది స్పందించారు. చంద్రబాబు వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల్లో చంద్రబాబుకు హైబీపి, షుగర్ ఉంది. చంద్రబాబుకు హైకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. కేసుతో సంబంధం లేని సెక్ష‌న్లు నమోదు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ ముద్దాయిగా పేర్కొన్నారని ఆయన తెలిపారు.