టార్గెట్ 2047.. ఇదీ.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న సంచలన లక్ష్యం. వచ్చే ఎన్నిక ల్లోనూఈ విషయాన్ని ప్రధానంగా ఆయన ప్రచారాస్త్రం కింద మలుచుకునే అవకాశం ఉంది. ఇదిలావుంటే .. ఇప్పటి నుంచే చంద్రబాబు టార్గెట్ 2047 దిశగా దూసుకుపోయేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభిం చారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఆయన ఈ కార్యక్రమానికి ప్రారంభం పలక నున్నారు.
విశాఖ కేంద్రంగా చంద్రబాబు టార్గెట్ 2047 కార్యక్రమానికి చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ఆగస్టు 15న చంద్రబాబు నాయుడు ఏకంగా 2 కిలో మీటర్ల మేర తిరంగా యాత్ర చేపట్టనున్నారు. బీచ్ రోడ్డులో ప్రారంభించే ఈ తిరంగా యాత్రకు సుమారు 2 వేల మందిని ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఇక, అదే రోజు విజన్ 2047 నివేదికను కూడా అదే రోజు చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.
సుమారు 200 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో విశాఖ బీచ్ రోడ్డులోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా యువతతోనూ ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఆగస్టు 15న చంద్రబాబు విశాఖపట్నంలోనే ఉంటున్నారు.అంతేకాదు.. వివిధ కార్యక్రమాల్లోనూ ఆయన పార్టిసిపేట్ చేయనున్నారు. తిరంగా యాత్ర నుంచి మేధావులతో భేటీ, మీడియాతో చిట్‌చాట్.. ఇలా అనేక కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉండనున్నారు.
మొత్తంగా చూస్తే.. ఎన్నికలకు మరో 8 మాసాల ముందు.. చంద్రబాబు.. సీఎంను మరిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వాయిస్ ఎక్కువగా వినిపించేలా కూడా కార్యక్రమాల కు రూపకల్పన చేస్తున్నారు. అదేవిదంగా ప్రతి నగరం, మండలం, గ్రామంలోనూ పార్టీ తరఫున కార్యక్రమా లను నిర్వహించనున్నారు. దీంతో ఆగస్టు 15 టీడీపీ గ్రాఫ్‌ను మలుపు తిప్పనుందనే లెక్కలు, అంచనాలు వస్తుండడం గమనార్హం.