దివంగత స్టార్ హీరోయిన్ దివ్యభారతి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాల్లో నటిస్తూ ఆ రోజుల్లోనే పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ అతి చిన్న వయసులోనే దివ్యభారతి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. దివ్యభారతి హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో ఆమెతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు. ఎంతమంది కొత్త హీరోయిన్లు వచ్చినా ఆమెనే తమ సినిమాలో హీరోయిన్‌గా కావాలని హీరోలు దర్శకనిర్మాతలు ఆశపడేవారు.
దివ్యభారతి హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో అప్పటి తరం హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. అయితే దివ్యభారతి చనిపోతున్న సమయంలో ఏకంగా 14 సినిమాలుకు పైగా ఒకే చెప్పింది. అయితే దివ్యభారతి సినిమాలు ఒకే చెప్పిన సమయంలో సడన్గా ఆమె మరణించడంతో ఆ సినిమాలలో వేరే హీరోయిన్లను తీసుకుని ఆ సినిమాలను తెరకెక్కించారు. అలా ఆ సమయంలో దివ్యభారతి స్థానంలో వచ్చిన ఇతర హీరోయిన్లు ఆ సినిమాల తర్వాత చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్లుగా వెలిగారు.
అలా నటించిన హీరోయిన్లలో శ్రీదేవి, కరిష్మా కపూర్, కాజల్, రవీనా, టబూ, పూజా బట్, జూహీ చావ్లా, మమతా కులకర్ణి వంటి చాలామంది హీరోయిన్లు దివ్యభారతి ఒప్పుకున్న సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. అలా దివ్యభారతి ఒప్పుకున్న సినిమాలలో హీరోయిన్లుగా నటించడమే కాకుండా ఆ తర్వాత ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు ఈ హీరోయిన్లు. ఈ సినిమాలలో దివ్యభారతి కనక నటించి ఉంటే ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేవని దర్శక నిర్మాతలు సైతం చాలా బాధపడ్డారట.