భోళాశంకర్ డిజాస్టర్ తో చిరంజీవి అప్ కమింగ్ మూవీస్ పై అనుమానాలు నెలకున్నాయి. ఆయన సినిమాలకు విరామం ఇస్తారని కొందరు అనుకున్నారు. కూతురు నిర్మణ సారధ్యంలో సినిమా ఇంకాస్త ఆలస్యం అవుతుందని, ఈ గ్యాప్ లో యూవి క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాను ప్రకటిస్తున్నారని కూడా వార్తలు వినిపించాయి. మోకాళ్ళకి చిన్నపాటి సర్జరీ చేపించుకున్న చిరు, తన తదుపరి చిత్రాలకు గ్యాప్ ఇస్తాడని ప్రేక్షకులు భావించారు.
అయితే ఊహించని విధంగా చిరు నుంచి ఓకేసారి 2 సినిమాల ఆప్ డేట్స్ వచ్చాయి. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కూతురు సుశ్మిత నిర్మాతగా సినిమా ప్రకటన వచ్చింది. అయితే తము చిరంజీవితో సినిమా చేయబోతున్నామని మాత్రమే ప్రకటించారు. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. కనీసం దర్శకుడుగా కల్యాణకృష్ణ పేరు కూడా ప్రకటించలేదు. అటు యూవీ కలెక్షన్స్ బ్యానర్ మాత్రం చిరంజీవితో సినిమాను పక్కాగా ప్రకటించింది.
బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. పంచభూతాలకు శక్తిచక్రంలో చూపిస్తూ ఆసక్తికరంగా పోస్టర్ రెడీ చేశారు. ఇక ఒకేసారి చిరంజీవి నుంచి 2 సినిమాల ప్రకటనలు వచ్చేస్తాయి. అయితే వీటిలో ముందుగా సెట్ పైకి వచ్చేది మాత్రం గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ మూవీనే. చిరంజీవి కెరీర్ లో 156వ చిత్రం ఇది. వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.