ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది వాణిశ్రీ. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారెట్ ఆర్టిస్ట్‌గా కీరోల్ ప్లే చేసి తనదైన స్టైల్ లో ముద్ర వేసుకుంది. 1962లో భీష్మ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన వాణిశ్రీ 1970 నాటికి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఎన్నో హిట్ సినిమాలు నటించిన ఈ అందాల తార అల్లరి పిల్ల, బంగారు కుంకుమ, బంగారు బిడ్డ, ఆడపిల్ల లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
1978లో డాక్టర్ కరుణాకర్‌ను పెళ్లి చేసుకున్న ఈమె కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 1989లో రీఎంట్రీ ఇచ్చి అప్పటినుంచి పలు సినిమాలలో నటించి మెప్పించింది. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఈమె విలన్, కమెడియన్ లాంటి పాత్రల్లో కూడా నటించింది. ముఖ్యంగా అత్త పాత్ర అద్భుతంగా పోషించి వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. అత్తగా ఆమె సిల్వర్ స్క్రీన్‌ను షేక్‌ర్ చేసిన సినిమాలేవో ఒకసారి చూద్దాం.
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, బొబ్బిలి రాజా, అల్లరి అల్లుడు, కలెక్టర్ గారి అల్లుడు, హలో బుల్లోడు, బొంబాయి ప్రియుడు ఇలా స్టార్ హీరోల సినిమాల్లో అత్తగా నటించి మెప్పించింది. ఈ సినిమాల్లో వాణిశ్రీ అత్త పాత్రలో బీభత్సం సృష్టించింది. హాస్యం, సెంటిమెంట్, ఫీలింగ్స్ అన్ని కలిపి మెప్పించింది. వాణిశ్రీ అత్త పాత్రలుల్లో నటించిన అన్ని సినిమాలు టాలీవుడ్ లో సక్సెస్ సాధించాయి. ఆమె యాక్టింగ్ తో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తెలుగు సినిమాల్లో అత్త పాత్రకే అర్థం ఇచ్చింది వాణిశ్రీ. కే.బాలచందర్ రాసిన సుఖదుఃఖాలు, మరపురాని కథలో.. కీరోల్ ప్లే చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. కృష్ణవేణి, ప్రేమనగర్, దసరా బుల్లోడు, ఆరాధన, జీవిత చక్రం, రంగులరాట్నం, భక్తకన్నప్ప, బొబ్బిలి రాజా లాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆమె నటించింది. 40 ఏళ్ల సినీ జీవితంలో 3 సౌత్ ఫీల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకుంది. నంది అవార్డ్‌లు, తమిళనాడు స్టేట్ ఫిలిం అవార్డులను కూడా దక్కించుకుంది. వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. భరతనాట్యంలో కూడా ఈమె శిక్షణ పొందింది.