హాలీవుడ్ సినిమాలో రజిని… అప్పట్లో ఓ పెద్ద సంచలనం…!

రజినీకాంత్ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇండియాలోనే కాదు జపాన్ లాంటి దేశాల్లోనూ ఆయనకు ఫాన్స్ ఉన్నారు. 1988లోనే రజినీకాంత్ హాలీవుడ్ సినిమాలో నటించాడు. రజనీకాంత్ ఈ పేరు చెప్తేనే ఓ వైబ్రేషన్ ఇప్పటికీ ఆయన సినిమాలు టీవీలో వస్తున్నాయంటే.. లేవకుండా కూర్చుని చూసే వాళ్ళు ఉన్నారు. ఈయన ఓ ట్రెండ్ సెట్టర్. రజినీకాంత్ స్టైల్ కే చాలా మంది అభిమానులు ఉన్నారు. కండక్టర్‌గా మొదలైన ఆయన జీవితం సినిమా ఇండస్ట్రీ వరకు వచ్చింది.

భారత్ తో పాటు పలు దేశాల్లో రజనీకాంత్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక తమిళనాడులో అయితే తలైవా అంటూ ప్రాణాలు ఇచ్చే అభిమానులు కూడా ఉన్నారు. ఎక్కడో మొదలైన రజినీకాంత్ కెరీర్ హాలీవుడ్ స్థాయికి వెళ్ళింది. ఓ హాలీవుడ్ సినిమాలో రజనీకాంత్ నటించిన విష‌యం కొంతమందికే తెలుసు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సినిమాకు ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఆ చిత్రం పేరు ” బ్లడ్ స్టోన్ “. ఈ సినిమాను నిర్మించింది అశోక అమృత రాజ్. 1988లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాకి డైరెక్టర్ డ్వైట్ హెల్ లిటిల్.

ఈ సినిమా షూటింగ్ బెంగళూరు, మైసూర్ లాంటి ప్రదేశాల్లో జరిగింది. ఇళయరాజా ద్వారా రజనీకాంత్ కు ఈ అవకాశం వచ్చింది. రజనీకాంత్ నటించిన చిత్రాల వీడియో టేప్స్ చూసి.. నీకో మాస్టర్ రాకేస్ సంతృప్తిచెంది తన సినిమాల్లోకి తీసుకున్నాడు. కొన్ని సన్నివేశాలను రజినీకాంత్ రీస్క్‌ తీసుకుని నటించడం చూసి.. ఆంగ్ల సాంకేతిక నిపులు ఆశ్చర్యపోయారట. రాత్రిపూట థియేటర్లో పెట్టుకుని ఆంగ్ల సంభాషణ, ఉచ్చారణ చూసుకునేవారు రజని డబ్బింగ్ రీ రికార్డింగ్ కూడా వెంటనే జరిగిపోయదట.