జుట్టు రాలిపోతుందా…. అయితే తప్పకుండా వాడాల్సిన నూనెలివే..!

ప్రతి ఒక్క వ్యత్తికి, ప్ర‌తి రంగానికి సంవత్సరంలో ఒక్కరోజు, వారం లేదా నెల ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే దానికి మాత్రం నెల గురించి చాలామందికి తెలియకపోవచ్చు. అసలు ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా ఆశ్చర్యపోయిన సందేహం లేదు. ఇంతకే ఈ నెలకున్న (ఆగస్టు 3) ప్రత్యేకత ఏమిటంటే…. జాతీయ జుట్టు నష్టం అవగాహన నెల. సాధారణంగా, ఒత్తిడి, భయం, ఆరోగ్య సమస్య వంటి అనేక కారణాలు వల్ల జుట్టు రాలడం జరుగుతుంది. ఇందుకు ముఖ్యమైన నూనెలను ఉపయోగించడం చాలా అవసరమని చెప్పొచ్చు.

రోజ్మేరీ నూనె:
ఈ నూనెను దాని గుణం కారణంగా సౌందర్య ఉత్పత్తులతో తయారు కు ఉపయోగిస్తారు. ఇది తలమీద చర్మాన్ని ఉత్తేజపరుస్తుంది. అలాగే రక్త ప్రసరణ ను పెంచడానికి ఆరోగ్యకరమైన జుట్టు పెరగడంలో సహాయపడుతుంది. అనేక జుట్టు ఇబ్బందులను కూడా తగ్గిస్తుంది.

లావెండర్ నూనె:
లావెండర్ నూనె ప్రశాంతమైన లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరంలో ఒత్తిడి తగ్గించే సమర్ధత కలిగి ఉంటుంది. ఇది తలలో మంటను తగ్గించడానికి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

పెప్పరమింట్ నూనె:
నేను నీలో మెంథాల్ ఉంటుంది. ఇది జుట్టు రాలడం లేదా రాలిపోయే అవకాశం ఉన్న తగ్గిస్తుంది. ఇది శితలీకరణ గుణాలను కలిగి ఉంటుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి నూనె బాగా పనిచేస్తుంది.

జోజోబా నూనె:
జోజోబా నూనె జుట్టు ఊడిపోకుండా ఉండడానికి గొప్ప ఔషధం అని చెప్పుకోవచ్చు. ఇది డాండ్ర, పేలు లాంటి ఏవి పట్టనివ్వదు. జుట్టు పెరుగుదల బాగా ఉంటుంది. ఈ నూనె వాడితే వారంలోనే పెరుగుదలను చూస్తారు.

టిట్రీ నూనె:
ఈ ఆయిల్ యాంటీ ఫంగల్ , యాంటీ ఆక్సైడ్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది సహజమైన పదార్థాలను కలిపి చేస్తారు. దీనివల్ల జుట్టు రాలడం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.