టాలీవుడ్‌లో నెక్ట్స్ చ‌నిపోయే హీరోయిన్ ఆమే… వేణుస్వామి సంచ‌ల‌న జ్యోతిష్యం…!

సెలబ్రిటీల పెళ్లిళ్లు, ప్రేమలు.. విడాకుల గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎప్పటికప్పుడు సంచలన కామెంట్లు చేస్తూనే ఉంటున్నారు. వేణుస్వామి చెప్పినవి చెప్పినట్టు జరుగుతూ ఉండడంతో ఆయన చెప్పే జాతకాలపై కూడా బాగా గురి కుదురుతోంది. నాగచైతన్య – సమంత పెళ్ళికి ముందే వీరిద్దరూ కలిసి ఉండ‌ర‌ని.. పెళ్లయిన కొన్నేళ్లలోనే విడిపోతారని ఆయన చెప్పినప్పుడు అందరు విమర్శించారు.

చివరికి వేణు స్వామి చెప్పిందే నిజం అయింది. అలాగే నిహారిక పెళ్లి విషయంలోనూ ఆయన ఎన్నో సందేహాలు వ్యక్తం చేయగా చివరకు అవే నిజం అయ్యాయి. ఇక వేణు స్వామి చెప్పే జ్యోతిష్యాన్ని ఆయన పూజలు కూడా టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు నమ్ముతున్నారు. ఇప్పటికే డింపుల్ హ‌య‌తి – నిధి అగర్వాల్ – రష్మిక లాంటి హీరోయిన్లు వేణుస్వామితో పూజలు కూడా చేయించుకున్నారు.

వేణు స్వామి కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ లో యంగ్ హీరో చనిపోతాడని చెప్పడంతో అందరూ ఆయనపై విమర్శలు చేశారు. ఆయన ఆ మాట చెప్పిన కొద్దిరోజులకే తారకరత్న అకాల మరణం చెందారు. ఇక ఇప్పుడు వేణు స్వామి మరో షాకింగ్ న్యూస్ బయట పెట్టారు. 40 సంవత్సరాల వయసు ఉన్న ఒక టాలీవుడ్‌ హీరోయిన్ త్వ‌ర‌లోనే చనిపోతుందని చెప్పారు.

వేణు స్వామి ఒక్కసారిగా ఈ మాట చెప్పడంతో ఆయన ఏ హీరోయిన్ ను ఉద్దేశించి చెప్పారు. ఇటీవల ఇబ్బందులు లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హీరోయిన్లు ఎవరు ? అంటూ ఎవరికి తోచినట్టుగా వారు రకరకాల హీరోయిన్ల పేర్లు పెడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి ఈసారి వేణు స్వామి జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.