టీడీపీలో ఇద్ద‌రు కొత్త ఇన్‌చార్జ్‌ల నియామ‌కం… ఆ టాప్ లీడ‌ర్ భార్య‌కు టిక్కెట్‌…!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. దాదాపు మరో 7 నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టిడిపి అలర్ట్ అవుతుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటిస్తూ టిడిపి అధినేత చంద్రబాబు ముందుకు దూసుకు వెళుతున్నారు. తాజాగా రెండు కీలకమైన నియోజకవర్గాలకు ఇన్చార్జిలను అధిష్టానం ప్రకటించింది.

ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కేంద్రమైన కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా మాధవి రెడ్డిని అధిష్టానం నియమించింది. గుంటూరు జిల్లాలోని ప్రతిపాడు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గ ఇన్చార్జిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి బి రామాంజనేయులు నియమిస్తూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెం నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. రామాంజనేయులు గత ఎన్నికలలో కర్నూలు జిల్లాలోని కోడుమూరు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ఇప్పుడు ఆయనకు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అప్పగించారు. వచ్చే ఎన్నికలలో రామాంజనేయులు ప్రత్తిపాడు నుంచి పోటీ చేయనున్నారు. ఇక కడప నియోజకవర్గ ఇన్చార్జిగా టిడిపి కీలక నేత రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి భార్య రెడ్డప్ప గారి మాధవి రెడ్డిని నియమించారు. వచ్చే ఎన్నికలలో మాధవి రెడ్డి అక్కడ నుంచి టిడిపి తరఫున పోటీ చేయటం ఖాయం అయింది.