బుల్లితెరపై ఎంతమంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నా సుమాకు ఉన్న క్రేజ్ మరే ఫిమేల్ యాంకర్ కు లేదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆమెను మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. బుల్లితెరపై దాదాపు అన్ని ఛానల్స్‌లో ప్రసారమయ్యే ఎంటర్టైనర్ షోలలో సుమా కచ్చితంగా హోస్టింగ్ చేస్తూనే ఉంటుంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, హీరో, హీరోయిన్లు ఇంటర్వ్యూలలో సుమనే ఫస్ట్ ఆప్షన్ గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక సుమ తన టాలెంట్‌కి తగ్గటు రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో అందుకుంటుంది. ఓ మిడిల్ రేంజ్ హీరోకి మించిన క్రేజ్ యాంకర్ గా సుమాకు ఉంది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన అంతగా సక్సెస్ కాలేదు. దీంతో యాంకర్‌గానే బుల్లితెరపై ఫిక్స్ అయిపోయింది ఈ మళయాలకుట్టి. ఇక సుమ జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. సుమా, రాజీవ్ కనకాల ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వారిద్దరి వివాహం అనుకున్నంత సులువుగా జరగలేదట. సుమ ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మా పెళ్లి అనుకున్నంత సులువుగా జరగలేదని మేమిద్దరం ప్రేమించుకుని పెద్ద వాళ్లకు చెప్పిన వెంటనే రాజీవ్ కనకాల పేరెంట్స్ ఒప్పుకున్నారని చెప్పింది.
కానీ మా అమ్మ, నాన్న మా పెళ్ళికి అంగీకరించలేదని.. నన్ను ఒక గదిలో వారం రోజులపాటు బంధించేసారంటు చెప్పుకొచ్చింది. నేను తిండి తిప్పలు లేకుండా అలాగే రాజీవ్ తలుచుకుంటూ బాధపడుతూ ఉండేదానని.. అది చూసిన మా అమ్మ, నాన్న ఇక లాభం లేదని మా ఇద్దరి పెళ్ళికి ఒప్పేసుకున్నారు అంటు వివరించింది. రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మా మధ్యన అడపా దడప గొడవలు జరుగుతూనే ఉన్నామని.. కానీ వెంటనే కలిసి పోతామని. ఒకసారి మాత్రం మేమిద్దరం 15 రోజులు వరకు మాట్లాడుకోకుండా ఉన్నామని.. అప్పుడే సోషల్ మీడియాలో విడిపోతున్నాం అంటూ వార్తలు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చింది సుమ.