చంద్రయాన్-3 సూప‌ర్ స‌క్సెస్ వెన‌క ఉన్న హీరోలు వీరే…!

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. భారత అంతరిక్షయానంలో ఎన్నో ఏళ్ల క‌ల సాకారం అయ్యింది. ఈ మహత్తర కార్యక్రమం వెనుక దాదాపు 1000 మంది ఇంజనీర్ల కృషి ఉందని ఇస్రో చైర్మన్ సోమనథ్ తెలిపారు. వీళ్లనే స్టార్లుగా పిలుస్తున్నారు. ఇందులో ప్రాధాన్యమైన వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్. సోమనాథ్,(ఇస్రో చైర్మన్):
ఎస్. సోమనాథ్ ఏయిరో స్పేస్ ఇంజనీర్. చంద్రాయాన్ 3ని జాబిల్లి కక్షలో ప్రవేశపెట్టడానికి ఉపయోగపడిన బాహుబలి రాకెట్‌ని రూపొందించడంలో సహకరించారు. రాకెట్‌లోకి చేరే ముందు చంద్రయాన్ 3 ని పూర్తిగా పరీక్షించే బాధ్యతలను తీసుకున్నాడు.

ఉన్నికృష్ణన్ నాయర్(విక్రమ్ సారబాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్):
రాకెట్ పరిశోధనల్లో మరో కీలక వ్యక్తి. అంతరిక్షంలోకి రాకెట్‌ని పంపే కార్యక్రమానికి నయకత్వం వహిస్తున్న ఏరోస్పేస్ ఇంజనీర్. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ స్తెన్స్ పూర్వ విద్యార్ధి. ఈయన ఈ ప్రాజెక్ట్ కి ఎంతో శ్రమించారు. లాంచ్ వెహికల్ మార్క్ 3 ఈయన నాయకత్వంలోని విజయవంతమైంది.

వీరముత్తువేల్:
ప్రముఖ శాస్త్రవేత్త వీరముత్తువేల్… చంద్రయాన్ 3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుకు తన మేధస్సును అందిస్తున్నారు. ఈయన చెన్నె నుంచి మాస్టర్స్ అఫ్ టెక్నాలజీలో పట్టా పొందారు. చంద్రయాన్ 2 మిషన్ లో కూడా ఈయన పాల్గొన్నారు.

కే. కల్పన:
మరో ముఖ్య ఇంజనీర్ కే. కల్పన. కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలోనూ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కోసం దీక్షగా తన బృందంతో కలిసి పనిచేశారు. ఈమె చంద్రయాన్ 3 మంగళయాన్ మిషన్స్ లో కూడా పాల్గొన్నారు.

ఎం. వనిత:
ప్రముఖ ఇంజనీర్ ఎం. అనిత చంద్రయాన్ 2 మిషన్ కు ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ లో పట్టా పొందిన ఈమె… బాజిల్లిపై చేసిన ప్రయోగానికి నాయకత్వం వహించిన భారత మొదటి మహిళ. చంద్రయాన్ 2 ఆమెకున్న జ్ఞానాన్ని చంద్రయాన్ 3 కోసం శాస్త్రవేత్తల బృందం సరిగ్గా వినియోగించుకుంది.

వీ. నారాయణన్:0
విక్రమ్‌ లాండర్ సాఫ్ట్ లాండింగ్ కావడానికి అవకాశం అయినా థ్రస్టర్లను ఈయన నాయకత్వంలో అభివృద్ధి చేశారు. చంద్రయాన్ 3ని ప్రయోగించిన లాంచ్ వెహికల్ మార్క్ 3 తో సహా ఇస్రో తయారు చేసిన చాలా రాకెట్లలో ఈయన మేధస్సు ఉపయోగపడింది.