బాలయ్య- రాఘవేంద్రరావు కాంబోలో మిస్ అయిన సూపర్ హిట్ ఇదే..!

ఇక ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలలో నట‌సింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అలాగే అయ‌న‌ చేస్తున్న సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం బాలయ్య నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏం కోరుకుంటున్నారో అలాంటి సినిమాలనే చేసుకుంటూ వస్తున్నాడు. నిజానికి బాలయ్యని బాగా వాడుకోగలిగితే ఆయనలో మంచి నటుడు ఉన్నాడు.

ఆయన చేసిన కమర్షియల్ సినిమాల కంటే కూడా డిఫరెంట్ గా ట్రై చేసిన భైరవద్వీపం, ఆదిత్య 369 సినిమాలే ఎంతో మంచి విజయం సాధించాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాల ద్వారానే బాలకృష్ణకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. అయితే ఇటువంటి సినిమాలు చేయడానికి బాల‌య్య‌ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. కానీ వాటిని బాగా హ్యాండిల్ చేసే డైరెక్టర్ బాలకృష్ణకి దొరికితే నిజంగా ఆయన తన నటనతో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తాడు.

అయితే ఇప్పుడు మంచు విష్ణు చేస్తున్న భర్త కన్నప్ప సినిమా మొదట రాఘవేందర్రావు డైరెక్షన్లో బాలయ్య చేయాల్సి ఉంది.. కానీ మధ్యలో కొన్ని అనుకోని కారణాల కారణంగా ఈ సినిమా మొదలు కాలేదు. దానికి ప్రధాన కారణం ఏమైనా కూడా భక్త కన్నప్ప సినిమా మీద బాలయ్య మంచి అంచనాలు పెట్టుకున్నడు కానీ చివరికి ఈ సినిమా మనం చేయలేమని అనడంతో బాలయ్య అప్పట్లో చాలా బాధపడ్డాడట.. అయితే ఇది జరిగిన చాలా సంవత్సరాలకి బాలయ్య- రాఘవేంద్రరావు కాంబోలో పాండురంగడు సినిమా వచ్చింది.

ఈ సినిమా అనుకున్న రేంజ్ లో అయితే ఆడలేదు. దాంతో ఆ సినిమా దగ్గరనుంచి బాలయ్య వ‌రుస‌ మాస్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు అనిల్ రావిపూడి తో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత కూడా బాబి తో మరో పక్క మాస్ యాక్షన్ సినిమా కూడా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ ఏడాది వీర సింహారెడ్డి సినిమాతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య.. రాబోయే రోజుల్లో కూడా బాలయ్య ఎలాంటి విజయాలు అందుకుంటాడో చూడాలి.