ఆ స్టార్ హీరోయిన్ కారణంగానే లలిత జ్యువెల్లరీస్ అధినేత ఇంత పెద్ద కోటీశ్వరుడయ్యాడా..!

డబ్బులు ఎవరికీ ఊరికే రావ్యు అనే ఒకే ఒక డైలాగ్ తో స్టార్ హీరోలను మించిన స్టార్ స్టేటస్ ను అందుకున్నారు లలిత జ్యువెలరీస్ ఎండి కిరణ్ కుమార్.. ఈయన తన వ్యాపార సంస్థలకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ ఎంతో సింపుల్‌గా మాట్లాడుతూ అందరికీ అర్థమయ్యే రీతిలో బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఇప్పటికే తన లలిత జ్యువెల్లరీస్ సంస్థను ఎన్నో ప్రాంతాల్లో విస్తరించుకుంటూ వచ్చారు.

అయితే ఈయనకు ఇంత సక్సెస్ రావటానికి కారణం ఓ స్టార్ హీరోయిన్ అంటూ గతంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కిరణ్ కుమార్ చెప్పుకొచ్చాడు. గతంలో కిరణ్ కుమార్ ఇంటర్వ్యూలు మాట్లాడుతూ.. నాకు అలనాటి స్టార్ హీరోయిన్ సావిత్రి అంటే ఎంతో ఇష్టం సావిత్రి గారి మీద ఉన్న ప్రేమతోనే వారి కుటుంబం కట్టించన ఇంట్లో చాలా సంవత్సరాలు అద్దెకు ఉన్నాను.. ఇక ఆ ఇంట్లో అద్దెకి దిగాకే నాకు వ్యాపార రంగంలో బాగా కలిసి వచ్చింది.

అలాగే ఆ ఇల్లు అమ్మేస్తానని వారి కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు తాను ఆ ఇంటిని కొనుగోలు చేస్తానని వారికి చెప్పాను అంతేకాకుండా కుటుంబ సభ్యులు కూడా కిరణ్ కుమార్ కి సావిత్రి పై ఉన్న ప్రేమను చూసి, అలాగే సావిత్రి కి బంగారం అంటే ఎంతో ఇష్టమని, ఆ బంగారు ఆభరణాలతో వ్యాపారం చేసే కిరణ్ కుమార్ కి సావిత్రి ఇల్లు అమ్మితే ఆమె ఆత్మ కూడా శాంతిస్తుందని ఉద్దేశంతోనే ఆ ఇంటిని కిరణ్ కుమార్ కి అమ్మారట.

అంత పెద్ద బిజినెస్మేన్ అయినా కూడా ఇప్పటికీ కిరణ్ కుమార్ సావిత్రి గారు నివసించిన ఇంటిలోనే ఉంటున్నారట. అలాగే సావిత్రి మీద ఉన్న ప్రేమతో ఆమె పేరుని కూడా ఆ ఇంటికి అలాగే ఉంచారట. ఈ విధంగా మహానటి సావిత్రి ఇంటికి వెళ్ళాకే ఆయనకు అదృష్టం కలిసి వచ్చిందని వ్యాపార రంగంలో లాభాలు వచ్చాయని ఆ ఇంటర్వ్యూలో కిరణ్ కుమార్ చెప్పుకోవచ్చురు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.