కింగ్ నాగార్జున (Nagarjuna ) హీరోగా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ది ఘోస్ట్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. సినిమాలో నాగార్జున సరసన సోనాలు చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక సినిమా నుచి ఫస్ట్ సింగిల్ వేగం సాంగ్ ప్రోమో రిలీజైంది. ఈ సాంగ్ లో నాగార్జున, సోనాలి చౌనాన్ ఇద్దరు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. రొమాంటిక్ లో నాగ్ ని మించిన వారు ఎవరుంటారు.
ది ఘోస్ట్ ఫస్ట్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచింది. అంతకుముందు వచ్చిన టీజర్ సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసింది. ది ఘోస్ట్ సినిమా ప్రవీణ్ సత్తారు మార్క్ యాక్షన్ మూవీగా రాబోతుంది. ఇక టాలీవుడ్ లో సినిమాలైతే చేస్తున్నా పెద్దగా గుర్తింపు రాని సోనాలి చౌహాన్ కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది.
దసరా రేసులో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్. అయితే చ్రు గాడ్ ఫాదర్ కోసం నాగార్జున (Nagarjuna) సైడ్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. వేగం ఫుల్ సాంగ్ 16న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ అవుతుంది. మరి ఈ సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.