ఈ సారి పక్కా మాస్..రామ్ -గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబోలో కొత్త అప్డేట్.. ఫాన్స్ కి ఇంకా పండగే..?

గౌతమ్ వాసుదేవ్ మీనన్ తమిళ్ లో మంచి పేరున్న దర్శకుడు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు తెలుగులో కూడా ఘన విజయం సాధించాయి. నాగచైతన్య హీరోగా నటించిన ఏ మాయ చేసావే, వెంకటేష్ హీరోగా నటించిన ఘర్షణ, నా ని ఎటో వెళ్ళిపోయింది మనసు చిత్రాలకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం గౌతమ్ తమిళ్ లో శింబు హీరోగా లైఫ్ ఆఫ్ ముత్తు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఐసరి కే గణేష్ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా ఈ నెల 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ గౌతమ్ మీడియాతో మాట్లాడుతూ తన తదుపరి చిత్రంగా రామ్ తో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. గతంలో మా ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉండగా అది ఆగిపోయిందన్నారు. అయితే ఇటీవల మళ్లీ రామ్ ని కలిసి కథ వినిపించానని.. వచ్చే ఏడాది మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని ప్రకటించారు.

నాని హీరోగా నటించిన ఎటో వెళ్ళిపోయింది సినిమాలో మనసులో మొదట హీరోగా ఎంపికైంది రామ్. ఆ సినిమా నుంచి రామ్ తప్పుకోవడంతో నానిని తీసుకున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు యాక్షన్ చిత్రాలను, లవ్ స్టోరీలను బాగా తెరకెక్కిస్తారని పేరుంది. అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత రామ్ పూర్తిగా మాస్ సినిమాలు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో గౌతమ్ కాంబోలో వస్తున్న సినిమా కూడా మాస్ చిత్రంగానే ఉంటుందని తెలుస్తోంది.

Tags: gowtham vasudev, ram, tollywood directors, tollywood gossips, tollywood news