యువ హీరోలకు బండ్ల గణేష్ చురకలు..పవన్ ని చూసి నేర్చకోండి అంటూ..

హీరో పవన్ కళ్యాణ్ కి ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు టాలీవుడ్ సెలబ్రిటీల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక పవన్ కి భక్తుడు ఇండస్త్రీలో ఎవరంటే గుర్తొచ్చేది బండ్ల గణేష్.. ఆయనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈవెంట్లలో పవన్ గురించి ప్రసంగాలు చేస్తుంటాడు.. ఇక సోషల్ మీడియాలో అయితే పవన్ ను పొగుత్తూ పోస్టులు పెడుతుంటాడు..

తాజాగా బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. ఆయన చేసిన ఆ ట్వీట్ నెటిజన్లకు ఆగ్రహాన్ని కలిగిస్తోంది. దీంతో ఆయన్ను బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాకు సంబధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జరిగింది. ఈ ఈవెంట్ కి యువ హీరోలు నాగ చైతన్య, అడివి శేష్, సిద్ధూ జొన్నలగడ్డ హాజరయ్యారు.. ఈవెంట్ లో సినీ పెద్దలు ఎవరూ రాలేదు..దీంతో ఆ యువ హీరోలు చాలా రిలాక్స్ డ్ గా, స్టయిలిష్ గా సీట్లలో కాళ్లు పైకి పెట్టుకొని కూర్చున్నారు..

ఆ యువ హీరోలు అలా కూర్చోవడం మన బండ్లన్నకు నచ్చలేదేమో.. అందుకే ఆ యువ హీరోలు కూర్చున్న ఫొటోను, ఆయన దేవుడు పవన్ కళ్యాణ్ ఓ ఆడియో ఫంక్షన్ లో పద్ధతిగా కూర్చున్న ఫొటోను షేర్ చేశారు. ‘నమస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర. దయచేసి నేర్చుకోండి. ఆచరించండి. అది మన ధర్మం’ అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ వైరల్ గా మారింది. దీనిపై బండ్లన్నను నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. వాళ్లేదో సరదాగా కూర్చున్నారు. అక్కడ ఎవరికీ లేని బాధ నీకెందుకు అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ హీరోను పొగడాలని ఇతర హీరోలను తిట్టాల్సిన అవసరం ఏముంది అంటే కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ఇతర ఫంక్షన్లలో పవన్ కళ్యాణ్ కాలు మీద కాలు వేసుకున్న స్టిల్స్ ను షేర్ చేస్తున్నారు. ఈ ట్వీట్లు ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Tags: actress, bandla ganesh, comments, latest news, new heros, Pawan kalyan, viral