త‌మ‌న్నా చేయి ప‌ట్టుకున్న అభిమాని.. ఆమె చేసిన ప‌నితో బిత్త‌ర‌పోయారుగా…!

మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. బాలీవుడ్ తో పాటు సౌత్ సినిమాలతో బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే లస్ట్ స్టోరీస్ 2 తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన భోళాశంకర్, జైలర్ విడుదలకి సిద్ధమయ్యాయి. ఇప్పటికే రిలీజైన జైలర్ సాంగ్ ‘ నువ్వు కావాలయ్యా ‘ అంటూ అభిమానుల్ని ఆకట్టుకుంది.

తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన తమన్నా అభిమానుల తాకిడి ఎదురైంది. కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళగా తమన్నాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆమె చుట్టూ బౌన్సర్స్ ఉండగా… వారంద‌రినీ తప్పించుకుని ఏకంగా తమన్న చేతిని పట్టుకున్నాడు. దీంతో అక్కడున్న బౌన్సర్స్ ఒక్కసారిగా అప్రమత్తమై అతన్ని పక్కకు తోసేశారు.

అయితే అభిమాని ప్రేమను గమనించిన తమన్నా బౌన్సర్లకు నచ్చజెప్పి… అభిమానితో నవ్వుతూ సెల్ఫీ దిగింది. మరి ఈ ముద్దుగుమ్మకు అభిమానులు అంటే ఆ మాత్రం ప్రేమ‌ ఉంటుంది అంటున్నారు నెటిజన్స్. కాగా… రజినీకాంత్ సరసన తమన్నా నటించిన జైలర్ ఈనెల 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. అలాగే మెగాస్టార్ సరసన నటించిన భోళాశంకర్ సైతం ఈనెల 11వ తేదీన రిలీజ్ కానుంది.