Brahmamudi August 7th Episode : రాజ్ ఆఫర్​ను రిజెక్ట్ చేసిన కావ్య.. స్వప్న దొంగ తెలివితేటలు చూసారా..!

Brahmamudi Today Episode : అప్పు దగ్గరికి కళ్యాణ్ వెళతాడు. తన కవితకు అమ్మాయి రెస్పాండ్ అయిందని చెబుతాడు. దీంతో పేరు ఏంటని అప్పు అడగగా… ఏదేదో చెప్పి కనుక్కోమనగా ఏదో అర్జెంట్ అంటే వచ్చానని దీని కోసమా అంటూ అప్పు వెళ్ళిపోతుంది. నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు బ్రో.. ఆ అమ్మాయిని పట్టుకోవాలంటే నువ్వే హెల్ప్ చేయాలని అంటాడు కళ్యాణ్… నా కవితలు మెచ్చుకుందని నాకు పరీక్ష పెట్టిందని, ప్లీజ్ నాకోసం బ్రో అని రిక్వెస్ట్ చేస్తాడు. మరోవైపు కావ్య గదిలో వంటరిగా కూర్చుని ఆలోచిస్తుంది. ఆరు నెలలలో అప్పు తీర్చేస్తానని చెప్పినా విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. దుగ్గిరాల ఇంట్లో గొడవ అయిన విషయానికి బాధపడుతుంది.

ఇలా కంపెనీలో జాబ్ చేసే డబ్బులు తీసుకెళ్తే అమ్మవాళ్ళు ఏంటి డబ్బులతో బతుకుతున్నారని జీవితాంతం అంటానే ఉంటారని బాధపడుతుంది. అప్పుడే రాజ్ వచ్చి నీకో గుడ్ న్యూస్ చెప్పాలని అంటాడు. నేను నీ కలను గుర్తించను అంటావు కదా ఇప్పుడు నీ కల‌కు గుర్తింపు తెచ్చానని చెబుతాడు. రాత్రిపూట ఆరుబయట కూర్చుని వేయాల్సిన పని లేదని అంటాడు. ఏ జీవితాంతం డిజైన్స్ గియోద్దంటారా అని కావ్య అంటుంది. జీవితాంతం డిజైన్స్ ఆఫీసులో గీ అని రాజ్ అంటాడు. అప్పోయింట్మెంట్ ఆర్డర్ కావ్యకి ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. కానీ కావ్య మాత్రం ఇంట్లో జరిగిన గొడవలను గుర్తు తెచ్చుకుంటుంది. ఏంటి ఎలాంటి రియాక్షన్ లేదు ఇది విని నువ్వు ఎగిరి గంతేస్తావ్ అనుకున్నాను అంటాడు రాజ్.

ఆలస్యమైంది అదృష్టాన్ని దక్కించుకునే అవకాశం లేదని అంటుంది కావ్య. నా చేతులు ఖాళీగా ఉన్నాయని డిజైన్స్ గీయలేనని డబ్బులు తీసుకోలేనని అంటుంది కావ్య. సారీ మీ ఆఫర్ తిరస్కరిస్తున్నానని అంటుంది కావ్య. నేను మధ్యతరగతిలో పుట్టినందుకు కలను నమ్ముకున్నందుకు అమ్ముకున్నందుకు ఎందుకు అని బాధపడుతుంది కావ్య. ఎందుకు నిరాశగా మాట్లాడుతున్నావు అంటాడు రాజ్. మీరు నా కోసం ఆలోచించినందుకు థాంక్స్ అని చెప్తుంది కావ్య. అర్థమైంది నాన్తడికి నేను అడిగినందుకు బెట్టు చేస్తున్నావని ఫైర్ అవుతాడు రాజ్. నీ అవసరం ఇప్పుడు కావాలని ఫీడ్ అప్ కొడుతున్నావా అని ఫైర్ అవుతాడు రాజ్. మీకు డిజైన్స్ అవసరం అయితే ఆరోజు నేను గీసి ఇస్తాను కానీ నాకు డబ్బు అవసరం లేదని అంటుంది కావ్య.

మెంటలా నీకు మీ ఇంట్లో వాళ్లు ప్రాబ్లమ్స్ లో ఉన్నారని నువ్వు ఈ జాబ్ చేసి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నావు కదా అంటాడు రాజ్. ఈ జాబ్ చేస్తే మీ ఇంటిలో ప్రాబ్లమ్స్ తీరిపోతాయి కదా అంటాడు రాజ్. దయచేసి నన్ను ఏమీ అడగకండి అంటూ వెళ్ళిపోతుంది కావ్య. రాజ్ ఆపే ప్రయత్నం చేస్తాడు. ధనలక్ష్మి వాళ్ళ మాటలు విని రాజ్ కి గొడవ మొత్తం వివరిస్తుంది. సంస్కారం ఉన్న పిల్ల కాబట్టి ఈ గొడవ నీతో చెప్పలేదు అని చెప్పి వెళ్ళిపోతుంది దాని లక్ష్మి. రాజ్- అపర్ణతో మాట్లాడుతూ నిన్ను తప్పు పట్టాలని కాదు మమ్మీ విషయం తెలుసుకోకుండా తొందరపడ్డావని అంటాడు కళావతి తప్పు చేసినప్పుడు నువ్వంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు ఎందుకు అంటున్నాను అర్థం చేసుకో అని చెబుతాడు. నేను డబ్బులు ఇస్తేనే తీసుకువెళ్లి వాళ్ళ నాన్నకు ఇచ్చిందని చెబుతాడు రాజ్. అది కూడా తన వేసిన డిజైన్ కి నేను డబ్బులు ఇచ్చాను అంతే అంటాడు.

తను డిజైన్స్ బాగా వేస్తుంది మిడిల్ క్లాస్ కాంట్రాక్ట్ వచ్చిందని తాతయ్య నన్ను మెచ్చుకున్నారు కదా దానికి కారణం కళావతి అని చెబుతాడు. తన అలా డబ్బు తీసుకెళ్తుంటే కోపం వచ్చిందని అపర్ణ అంటుంది. నువ్వు ఓకే అంటే కళావతిని మన కంపెనీలో జాయిన్ చేసుకుంటా అంటాడు రాజ్. ఆడపిల్ల తన కాళ్ళ మీద తన నిలబడతానంటే నేను మాత్రం ఎందుకు వద్దంటానంటుంది అపర్ణ. కావ్య నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తికి ఫోన్ చేసి వినాయక చవితి వస్తుంది కదా అంకుల్ మాకు కాంట్రాక్ట్ ఇవ్వలేదు ఏంటి అని అడుగుతుంది. అదేంటమ్మా మీరు షాప్ కి రావడం లేదని వేరే వాళ్ళకి ఇచ్చేశాను అంటాడు.

మీ అమ్మగారు ఇప్పుడు ఓకే అన్నారని చెప్పి నాకు చెబుతానికి వచ్చారు వద్దు అంటే ఏం చేసేవారు అంటే రాజ్ ఆలోచనలోకి వెళ్తాడు ఇలానే మౌనం పాటించడం వల్ల చాలా నష్టాలు వస్తాయంటుంది కావ్య. ఏంటి డబ్బు తీసుకెళ్లి ఆ ఇంటికి పెట్టిన దాన్ని అవుతాను మా ఇంట్లో వాళ్ళు వీళ్ళ ముందు తలెత్తుకోలేరు అని చెబుతుంది కావ్య. నేను ఇప్పుడు ఈ జాబ్ చేసినట్లయితే మీ ఇంట్లో వాళ్ళు అనే మాటలు నేను వినలేను అని చెప్పుతుంది కావ్య. మా ఇంట్లో వాళ్ళు నిన్ను ఏమీ అనకుండా చూసుకుంటాను అంటూ రాజ్ అనగా దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి అంటూ కావ్య అంటుంది.

దీనికి ఒళ్లంతా పొగరు అని రాసి తిట్టుకుంటాడు. అప్పుడు రాహుల్ తాగి వస్తాడు. ఈరోజు నాకు ఆనందంగా ఉంది అని అంటాడు నువ్వు మా పెద్దమ్మ దగ్గర కావ్యాన్ని ఇరికించడం నేను చూశాను అంటాడు రాహుల్. నేను ఏం చేసినా నీకోసమే రాహుల్ నిన్ను ఆ కావ్య ఇరికిస్తుంది కదా అందుకే ఇలా చేశా అంటుంది స్వప్న. తన కడుపు విషయం విన్నాడేమోనని టెన్షన్ పడుతుంది. నేను ఏం చేసినా… నీ దీంతో అంటూ ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.