మహేష్ అందం వెనుక టాప్ సీక్రెట్ ఇదే..!

నట్స్ ఐస్ క్రీమ్ తింటే ఫ్యాక్ట్ వస్తుంది. కానీ ఇక్కడ నట్స్ ఐస్ క్రీమ్ తింటే అందంతో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అంటున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. 50 వయసుకు దగ్గరవుతున్న టీనేజ్ లానే ఉండడానికి గల కారణం ఏంటనేది బయటపెట్టిన మహేష్. యంగ్ జనరేషన్ కి అన్ని విధాలా రోల్డ్ మోడల్ పైన మహేష్ అల్పాహారం హ్యాబిట్ యువతరాన్ని విశేషంగా ఆహ్వానిస్తుంది.

తాజాగా మహేష్ బ్రేక్ ఫాస్ట్ ఆహారం తాలూకా ఫోటో షేర్ చేసి తాను ఏ ఆహారం ? తీసుకుంటాడు అనేది వెల్లడించాడు. నట్స్ తో తయారు చేసిన ఓట్ మీల్ ఉదయం పూట అల్పాహారంగా తీసుకుంటారట. “రాత్రిపూట నానపెట్టిన ఓట్స్, కాయలు… గింజలతో తయారుచేసిన పదార్థమిది. మరో రెండు గంటలలో నాకు పవర్ కావాలి ” ఆనీ మహేష్ బాబు వ్యాఖ్యలు జోడించాడు.

తక్షణమే తనకు ఎనర్జీ కావాలంటే ఇలా ప్లాన్ చేసుకుంటాడని దానిని బట్టి అర్థమవుతుంది. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాన్ని గ్లామర్ రంగంలోని సెలబ్రిటీలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఆహారంలో ఎలాంటి కొలెస్ట్రాల్ లాంటివి లేకుండా ఆకుకూరలు పండ్లు ఇలా బ్యాలెన్స్ చేస్తా ఉంటారు. కారణం ఏదైనా కానీ మంచి డైట్ తో మహేష్ ఈ ఏజ్ లో కూడా షాప్ ఇచ్చే పర్సనాలిటీ తో కనిపిస్తున్నాడు.