యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమా మానియాలో కొట్టుకుపోయిన సినిమాలు ఏమిటో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ దర్శకుడు కొరటాల శివతో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.. త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో భారీ క్రేజ్ అందుకున్నాడు. ఇప్పుడు చేస్తున్న దేవర సినిమాని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరీ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్‌కు విలన్ గా ఈ సినిమాలకు నటిస్తున్నాడు.

ఈ సినిమా విషయం ఇలా ఉంచితే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో గతంలో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా 2016 సెప్టెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటించాడు. ఈ సినిమాకు ఎన్టీఆర్‌ 13 సంవత్సరాలుగా ఇండస్ట్రీ హిట్ కోసం ఎదురు చూస్తుండగా జనతా గ్యారేజ్ వచ్చి ఆయన కోరికను నెరవేర్చింది.

ఇక నిన్నటితో జనతా గ్యారేజ్ రిలీజ్ అయి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సంబరాలు చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో సినిమాకు పోటీగా చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో నారా రోహిత్- నాగశౌర్యలు జో అచ్యుతానంద, యావరేజ్ గా నిలిచింది. అలాగే శ్రీకాంత్ కొడుకు రోష‌న్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్ ప్లాప్‌ సినిమాగా మిగిలిపోయింది.

అలాగే నాని నటించిన మజ్ను సినిమా కూడా యావరేజ్ గా నిలిచింది. రామ్ నటించిన ‘హైపర్’ పెద్ద ప్లాప్ అయ్యింది. నాగ శౌర్య ‘నీ జతలేక’, సునీల్ నటించిన ‘ఈడు గోల్డ్ ఎహె’ ‘మా ఊరి రామాయణం’ వంటి సినిమాలు అన్నీ ‘జనతా గ్యారేజ్’ దెబ్బకి బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి.