మరోసారి తండ్రి కాబోతున్న దర్శకధీరుడు.. అసలు విషయం ఏమిటంటే..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే అపజయం ఎరుగని డైరెక్టర్ ఎవరంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే పేరు రాజమౌళి.. రాజమౌళి తన కెరీర్లో ఇప్పటివరకు ఒక ప్లాఫ్ కూడా చూడలేదు.. ముందుగా సీరియల్ కు దర్శకత్వం వహిస్తూ పనిచేసిన రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. తన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకొని తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లోనే స్టార్ దర్శకుడుగా పేరు తెచ్చుకొని ప్రస్తుతం గ్లోబల్ దర్శకుడిగా మారాడు.

రాజమౌళి తెలుగు సినిమా పరిశ్రమను ప్రపంచవ్యాప్తంగా త్రిబుల్ ఆర్ సినిమాతో గర్వించేలా చేశాడని చెప్పవచ్చు. పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి సినిమాలతో మంచి విజయం అందుకున్న రాజమౌళి.. ప్రస్తుతం తన తర్వాత సినిమాని మహేష్ బాబుతో కలిసి చేయబోతున్నాడు. ఇక రాజమౌళి వ్యక్తిగత విషయానికి వస్తే రాజమౌళి రమా అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. ఇది రాజమౌళికి మొదటి పెళ్లి అయినప్పటికీ రమకు మాత్రం రెండో వివాహం.

రమకు ఇదివరకే పెళ్లి చేసుకుని కార్తికేయ అనే అబ్బాయికు జన్మనిచ్చింది. ఆ తర్వాత భర్తతో విభేదాలు రావడంతో అతనితో విడిపోయింది. అలా కొడుకుతో ఒంటరిగా ఉన్న రమాను రాజమౌళి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పటివరకు వీరికి పిల్లలు పుట్టలేదు మాయ‌క‌ అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా రాజమౌళి గురించి మరో విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దర్శకధీరుడు మరోసారి తండ్రి కాబోతున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే ఈ విషయం తెలిసిన పలువురు నెటిజెన్స్ తాత కావలసిన వయసులో రాజమౌళి తండ్రి కావడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..అసలు విషయంలోకి వెళ్తే రాజమౌళి అనాధ పిల్లలకు ఎంత అండగా నిలుస్తూ ఉన్నారో అందరికీ తెలిసింది..ఇప్పుడు తాజాగా మరొక అనాధ ఆడపిల్లను దత్తకు తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి బాగోగులను తనే చూసుకోబోతున్నట్లు సమాచారం.. దీంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.