ఆ రెండు సెంటిమెంట్లు బాగా నమ్ముతున్న అల్లు అర్జున్… పుష్ప2కి కలిసి వస్తాయా..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో ఎవరు ఊహించని బంపర్ హిట్ అందుకున్నాడు. చిత్ర పరిశ్రమలో ఉండేవారికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అల వారు ఆ సెంటిమెంట్ ని కనుక ఫాలో అయినట్లయితే కచ్చితంగా హిట్ వస్తుందని నమ్ముతారు. అల్లు అర్జున్‌కి కూడా కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొడుకుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

త‌న నటనతో డాన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. కోట్లాదిమంది ప్రేక్షకులను తన అభిమానులకు మార్చుకున్నాడు. టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్ లో సూపర్ సక్సెస్ అందుకుని భారీ క్రేజీని తెచ్చుకున్నాడు.. ఇప్పుడు అదే సినిమాకి ఉత్తమ నటుడుగా కూడా జాతియ‌ అవార్డుని అందుకున్నాడు. ప్రస్తుతం ఇదే సినిమకి సిక్వల్ గా పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా తర్వాత స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌తో తన తర్వాత సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. అయితే రెండు సెంటిమెంట్లు బన్నీకి బాగా కలిసి వచ్చాయి..ఏప్రిల్ నెల.. ఆ నెల మూవీ వచ్చిందంటే హిట్ కాయం అని దాన్ని బాగా నమ్ముతాడు. ఆ విధంగానే బన్నీ నటించింన‌ నాలుగు సినిమాలు ఏప్రిల్ నెలలో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద మంచి విజ‌యం సాధించ‌యి.

ఇక మరో సెంటిమెంట్ వైజాగ్.. బ‌న్నీ నటించిన సినిమాలలో వైజాగ్ లో షూటింగ్ చేస్తే కచ్చితంగా అది కలిసి వస్తుందని బాగా నమ్ముతాడు.. గంగోత్రి, ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు సినిమాలు వైజాగ్ లోనే షూటింగ్ జరిగాయి. ఈ ఐదు సినిమాలు కూడా బన్నీకి బాగా కలిసి వచ్చాయి. ఇప్పుడు పుష్ప 2 లోని కొన్ని సన్నివేశాలు కూడా వైజాగ్లో షూటింగ్ చేశారు. మరి ఈ సెంటిమెంట్ బన్నీకి ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.