క్యాస్టింగ్ కౌచ్ ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ నుంచి సీనియర్ హీరోయిన్ వరకు ప్రతి ఒక్కరి నోటి వెంట వినిపిస్తున్న పదం. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ సినిమా ఇండస్ట్రీ మొదలు పెట్టినప్పటి నుంచి ఉందట. కానీ అప్పట్లో చాలా తక్కువ నటులు దీని బారిన పడ్డారు. కానీ గతంలో సోషల్ మీడియా లేకపోవడం కారణంగా క్యాస్టింగ్ కౌచ్ పదం పెద్దగా వెలుగులోకి రాలేదు. కానీ ఈ మధ్యకాలంలో అయితే దీని బారిన ఎంతో మంది హీరోయిన్లు పడ్డామని తమ ఆవేదనను తెలుపుతున్నారు.
అయితే తాజాగా నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలునే అని సీనియర్ నటి ఆమని చెప్పుకొచ్చింది. ఆమని మాట్లాడుతూ… ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో డైరెక్టర్లు దగ్గర ఉండే మేనేజర్లు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం అయ్యేది కాదు. కొంతమంది నన్ను సినిమాలో ఓకే చేశాక మిమ్మల్ని డైరెక్టర్ గారు కలవాలనుకుంటున్నారు. స్టోరీ చెబుతారట ఇంటికి రండి అంటూ స్వయంగా మేనేజర్ వచ్చి చెప్పేవాడట. అలాగే నా దగ్గరికి కూడా ఓ మేనేజర్ వచ్చి మా సినిమాలో మీరు ఓకే అయ్యారు డైరెక్టర్ మీకు స్టోరీ చెపుతారట అలాగే ఫైనాన్షియర్ మిమ్మల్ని ఒకసారి చూస్తారట అని చెప్పారు. కానీ అప్పటికే నాకు డౌట్ వచ్చింది చూస్తే గీస్తే డైరెక్టర్ లేదా నిర్మాత , హీరో చూడాలి కానీ ఫైనాన్షియర్ చూడడం ఏంటి అని అనుకున్నాను.
అంతేకాకుండా మేనేజర్ కారులో మీ మమ్మీ ని తీసుకురాకండి మీరు ఒక్కరే రండి అని చెప్పేవాడు. దానితో అక్కడే నేను అర్థం చేసుకున్నాను… వాళ్లు నా నుండి వేరే ఆశిస్తున్నారని. అయితే ఓ సినిమాలో నాకు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసే షూట్ వచ్చింది. అంతేకాదు ఆ సన్నివేశం చేయడానికి మీ డ్రెస్ మొత్తం తీసేయండి. మీకు ఎక్కడైనా స్ట్రచ్ మార్క్స్ ఉన్నాయేమో చూస్తాం అని అన్నారు. దానితో నాకు ఈ పాత్ర వద్దు నేను ఈ పాత్రలో నటించను అని చెప్పి వచ్చేసాను అంటూ ఆమని తను ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాలని తాజాగా ఓ ఇంటర్వ్యూలు తెలియజేసింది.