మట్టి పనులు చేస్తూ కావ్య తన కుటుంబ పరువు తీసింది అని అపోహపడి నానా మాటలు అంటది అపర్ణ. కావ్య ని తప్పుబడుతుంది. రాజ్ కూడా కావ్యనే తిడతాడు. పుట్టింటి కోసమే తన కష్టపడుతున్నట్లు తన ఏ తప్పు చేయలేదని కావ్య చెప్పినా ఎవరూ పట్టించుకోరు. బొమ్మలు చేసే పనిని వదిలేయమని, అలాగే పుట్టింటికి కూడా వదిలేయమని అపర్ణ- రాజ్ చెబుతారు.
లేదంటే దుగ్గిరాల ఫ్యామిలీలో నీకు చోటు ఉండదని భయపడతారు. తన కుటుంబ సమస్యలు గుర్తుకొచ్చి కావ్య ఏ మాత్రం భయపడదు. బొమ్మలకు రంగులు వేసి కాంట్రాక్టర్ కి ఇవ్వడానికి పుట్టింటికి వెళ్తుంది. దుగ్గిరాల వంశంలో కావ్యని దోషిని చేయాలని తన ప్రయత్నం రాహుల్, రుద్రాణి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. చెప్పుడు మాటలతో రాజ్ మనసును మార్చేస్తాడు రాహుల్. బొమ్మల కాంట్రాక్ట్ దూరమైతే నేను హెల్ప్ అడుగుతుందని చెప్తాడు రాహుల్.
రాహుల్ మాటలు నిజమని నమ్మిన రాజ్ అతను చెప్పినట్లు చేస్తాడు. కావ్య బొమ్మల కాంట్రాక్ట్ ని తన పలుకుబడితో క్యాన్సిల్ చేపిస్తాడు రాజ్. కాంట్రాక్టర్ ద్వారా రాజ్ ఈ పని చేపించాడని కావ్య తెలుసుకుంటుంది. భర్త చేసిన పనికి కావ్య ఎలా రియాక్ట్ అయ్యింది? పుట్టింటికి సాయం చేయబోయి అత్తింటికి కావ్య దూరమైందా? పుట్టింటి కష్టాలు తీర్చడం కోసం కావ్య ఏం చేసింది. రాజ్ ని ఎలా ఎదుర్కొంది ఇవి రేపటి ఎపిసోడ్ లో చూడాలి.